నార్త్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

0

విజయ్ దేవరకొండ తదుపరి సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాకి ‘ఫైటర్’ అనే టైటిల్ ను పూరి జగన్నాథ్ ఖాయం చేశాడు. పూరి మార్కుతో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ చిత్రం కథావస్తువు అన్ని ప్రాంతాల .. భాషల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేది కావడంతో, వివిధ భాషల్లో దీనిని విడుదల చేయాలనే ఆలోచనతో పూరి వున్నాడట. అందువలన నిర్మాణ భాగస్వామ్యం కోసం కోలీవుడ్ .. బాలీవుడ్ కి సంబంధించిన నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారట. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన కైరా అద్వాని కథానాయికగా కనిపించే అవకాశాలు ఎక్కువని అంటున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here