న‌య‌న‌తార‌కు ఆ స‌మ‌స్య ఉంద‌ట‌..!

0

టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డ‌మే కాకుండా సౌత్ ఇండియాలో ప్ర‌స్తుతం టాప్ ప్లేస్ లో ఉంది న‌య‌న‌తారు. కోలీవుడ్ లో వ‌రుస హిట్లు సాధిస్తూ, టాలీవుడ్ లో సెల‌క్టెడ్ మువీస్ తో ఈ భామ మెప్పిస్తోంది. ఓవైపు ప‌లువురితో ప్రేమాయ‌ణాల ద్వారా నిత్యం వార్త‌ల్లో నిలిచే న‌య‌న‌తార తాజాగా మ‌రో విష‌యంలో హాట్ టాపిక్ గా మారింది.

తాము న‌టించిన సినిమాల ప్ర‌మోష‌న్ వ‌ర్క్ కూడా ప్ర‌స్తుతం హీరో హీరోయిన్ల‌కు ప్ర‌ధాన బాధ్య‌త‌గా ఉంటోంది. కానీ దానికి న‌య‌న‌తార దూరంగా ఉండ‌డం విశేషంగా మారుతోంది. తాజాగా సైరా న‌ర‌సింహ‌రెడ్డి సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న మెప్పించిన ఈ తార సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌కు మాత్రం దూరంగా ఉంది. త‌మ‌న్నా కూడా మీడియా స‌మావేశాల‌కు వ‌స్తున్న‌ప్ప‌టికీ న‌య‌న‌తార మాత్రం స‌సేమీరా అంటోంది.

అందుకు ఓ కార‌ణం ఉంద‌ని చెబుతున్నారు. సినిమా ప్ర‌మోష‌న్ కి హాజ‌రుకావ‌డం న‌య‌న‌తార‌కు స‌మ‌స్య‌గా ఉంద‌ట‌. ముఖ్యంగా ఆమె ప్ర‌మోట్ చేసిన సినిమాలు ఫెయిల్ కావ‌డంతో అదో సెంటిమెంట్ గా మారింద‌ని చెబుతోంది. గ‌తంలో త‌న ప్రియుడు శివ‌న్ సినిమాల‌కు ప్ర‌చారం చేసిన‌ప్ప‌టికీ అవి ఫలితం ఇవ్వ‌క‌పోవ‌డంతో ప్ర‌స్తుతం ఆ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న‌ట్టు చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here