న‌-షా వ్యూహాల‌కు ఆ ఇద్ద‌రే అడ్డంకి..!

0

బీజేపీకి త‌ల‌నొప్పిగా మారుతున్న ఆ ఇద్ద‌రు!

కేంద్రంలో అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ఏపీలో బ‌ల‌ప‌డ‌లేక‌పోతున్నామ‌నే బాధ క‌మ‌ల‌నాధుల‌ను క‌లిచివేస్తుంది. క‌నీసం తెలంగాణా త‌ర‌హాలోనైనా ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్ లో పాగా వేయాల‌ని ఆశిస్తోంది. మొన్న‌టి సాధార‌ణ ఎన్నిక‌ల్లో క‌నీసం ఒక్క శాతం ఓట్లు కూడా చ‌తికిల‌ప‌డిన పార్టీ మ‌ళ్లీ పుంజుకోవాల‌ని ఆశిస్తోంది. ఒక‌ప్పుడు ఏపీలో 18శాతం ఓట్లు సాధించిన పార్టీ ఈసారి అన్ని స్థానాల‌కు బ‌రిలో దిగిన‌ప్ప‌టికీ ఎందుకు కుదేల‌య్యామ‌న్న‌ది ఆలోచించుకుంటోంది.

ఇత‌ర పార్టీల నేత‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డం ద్వారా బ‌ల‌ప‌డాల‌ని బీజేపీ చాలాకాలంగా భావిస్తోంది. 2014 ఎన్నిక‌ల‌కు ముందు పురందేశ్వ‌రి, కావూరి వంటి వారిని పార్టీలో చేర్చుకున్న బీజేపీ, ఎన్నిక‌ల అనంత‌రం పార్టీలో చేరిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ని ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిని చేసింది. అయినా బ‌లోపేతం అవుతున్న సంకేతాలు లేవు. ఇక తాజాగా ఎన్నిక‌ల ఫ‌లితాలు రాగానే టీడీపీ నుంచి ప‌లువురు క‌మ‌లం గూటికి క్యూ క‌డుతున్నారు. వారిలో కీల‌క నేత‌లు సీఎం ర‌మేష్, సుజ‌నా చౌద‌రి వంటి వారున్నారు.

ఇప్పుడు ఆ ఇద్ద‌రు నేత‌లు కార‌ణంగా ఏపీలో బీజేపీ బ‌ల‌ప‌డాల‌నే ల‌క్ష్యానికి ఆటంకం ఏర్ప‌డుతుంద‌నే అభిప్రాయం సీనియ‌ర్ బీజేపీ నేత‌ల్లో వినిపిస్తోంది. బీజేపీలో ఉంటూ బాబు స్వ‌రం వినిపించేందుకు వీరిద్ద‌రూ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌తో బీజేపీ బ‌ద్నాం అవుతుంద‌నే బెంగ క‌నిపిస్తోంది. రాజ‌ధాని, పోల‌వ‌రం వంటి విష‌యాల్లో సుజనా, సీఎం ర‌మేష్ స్పంద‌న దానికి త‌గ్గ‌ట్టుగా ఉంద‌ని చెబుతున్నారు. వారి ధోర‌ణి కార‌ణంగా బీజేపీకి న‌ష్టం త‌ప్ప‌డం లేద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. త‌ద్వారా బీజేపీ ఎదుగుద‌ల‌కు ద‌క్కుతున్న అవ‌కాశాలు కూడా నీరుగార్చుకున్న‌ట్ట‌వుతుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు.

అయితే సుజ‌నా మాజీ కేంద్ర మంత్రి హోదాలో ఢిల్లీలో చ‌క్రం తిప్పే అవ‌కాశాలుండ‌డం, కీల‌క నేత‌లు నిత్యం యాక్సెస్ ఉండ‌డంతో స్థానిక బీజేపీ నేత‌లు ఎంత‌గా బాధ‌ప‌డినా పెద్ద ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న‌ది ప‌రిశీల‌కుల అంచ‌నా. వారితో పాటుగా మ‌రింత మంది టీడీపీ నేత‌లు క‌మ‌లం క్యాంప్ కి స‌న్నిహితులుగా మారుతున్న త‌రుణంలో ఏపీలో చంద్ర‌బాబు అడ్డు తొల‌గించుకోవ‌డం ద్వారా ఆ స్థానానికి చేరుకోవాల‌నుకుంటున్న బీజేపీ ఆశ‌ల‌కు బ్రేకులు త‌ప్ప‌వ‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here