‘పింక్’ ప‌వ‌న్: టాలీవుడ్ రీ ఎంట్రీ

0

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. టాలీవుడ్ లో మ‌ళ్లీ ప‌వ‌ర్ స్టార్ త‌న హ‌వా చాటేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఏపీ అంత‌టా ప్ర‌చారం చేసినా ఆయ‌న పార్టీకి ఆశించిన ఫ‌లితాలు రాలేదు.అ యినా విప‌క్ష హోదాలో ప్ర‌జాప‌క్షంలో ఉంటామ‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న ఇసుక స‌మ‌స్య‌పై లాంగ్ మార్చ్ సాగిస్తున్నారు.

అదే స‌మ‌యంలో ఆయ‌న లేటెస్త్ మువీకి సంబంధించిన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. రీమేక్ మువీతో ప‌వ‌న్ రీ ఎంట్రీ ఖాయం అయ్యింది. బాలీవుడ్ చిత్రం పింక్‌ను తెలుగులో చేయాల‌ని నిర్ణ‌యించిన సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది. 2018లో విడుద‌లైన అజ్ఞాత‌వాసి త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌లేదు. రెండేళ్ల విరామం త‌ర్వాత ఆయ‌న స్క్రీన్ మీద క‌నిపించే ఛాన్స్ ఖ‌రారు కావ‌డంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

బాలీవుడ్‌లో అమితాబ్ చేసిన లాయ‌ర్ పాత్ర‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించ‌నున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్‌, టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఓ మై ఫ్రెండ్‌, ఎంసీఏ చిత్రాల ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ సినిమాను డైరెక్ట్ చేయ‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here