పొమ్మ‌న్న వాళ్లే ర‌మ్మంటున్నారు.. రైలు సింగ‌ర్ జీవితం

0

రైలు సింగ‌ర్ రేణు మండ‌ల్ జీవితం ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఆమె గురించి ప‌లువురు ఆస‌క్తిగా తెలుసుకుంటున్నారు. రైల్వే ఫ్లాట్ ఫామ్ మీద పాట‌లు పాడే ద‌శ నుంచి ఏకంగా సోనీ టీవీ పిలుపు అందుకునే ద‌శ‌కు చేర‌డంతో రాత్రికి రాత్రే ఆమె స్టార్ గా మారిపోయింది.

అయితే ఆమె కుటుంబ వ్య‌వ‌హారాలు కూడా ఇప్పుడు చ‌ర్చ‌కు తెర‌లేపుతున్నాయి. అద్భుత‌మైన గొంతుతో పాటలు పాడుతూ బిక్షాట‌న‌తో జీవ‌నం గ‌డిపిన రేణు మండ‌ల్ కి ఇప్పుడు మేమున్నామంటూ ప‌లువురు క్యూ క‌డుతున్నారు. ఇన్నాళ్లుగా ఆమెని క‌ష్టాలు పాలుజేసిన క‌న్న‌వారే ఇప్పుడు అమె కీర్తిని చూసి ద‌గ్గ‌ర‌య్యేంద‌కు చేస్తున్న ప్ర‌య‌త్నం విస్మ‌య‌క‌రంగా మారుతోంది.

బంధం, అనుబంధాల విలువ మంట గలిపే రీతిలో, అసహ్యంగా ఉందని కన్నతల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన కూతురే..ఇప్పుడు దేశం మొత్తం ప్రశంసించిన తర్వాత ప్రేమగా చూసుకుంటానని ముందుకు రావడం ఆలోచించాల్సిన విషయం. అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే అన్న‌ట్టుగా ఉన్న స‌మాజంలో క‌న్న‌పేగు బంధం కూడా పూర్తిగా ఆర్థిక వ్య‌వ‌హారాల‌కే ప‌రిమితం అని ఈ ఘ‌ట‌న చాటుతోంది.

ఒక యువకుడు చొర‌వ‌తో పాట‌ని రికార్డ్ చేయ‌డంతో రేణుమండ‌ల్ జీవితం మారిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..సోనీ ఛానెల్ నుండి పిలుపు వ‌చ్చింది. చివ‌ర‌కిప్పుడు ఏ కూతురైతే తల్లి ముసలిదైంది అని ఇంట్లో నుండి గెంటేసిందో ఆమే వచ్చి మొఖాన నవ్వు పులుముకోని తల్లిని హత్తుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here