పోల‌వ‌రం ప్రాజెక్ట్: ‘ఈనాడు’ పోయి ‘టీవీ9’ వ‌చ్చింది..!

0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌కు మీడియా వ్య‌వ‌హారాలు ముడిప‌డి ఉన్నాయ‌నే అంద‌రికీ తెలిసిందే. తాజాగా కీల‌కంగా భావించే పోల‌వ‌రం ప్రాజెక్ట్ వ్య‌వ‌హారంలో ప‌రిణామాలు దానిని చాటుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉండ‌గా చ‌క్రం తిప్పిన సంస్థల స్థానంలో కొత్త కాంట్రాక్ట‌ర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నారు.

కాంగ్రెస్ హ‌యంలో ట్రాన్స్ ట్రాయ్ ప్ర‌ధాన కాంట్రాక్ట‌ర్ గా ఉండ‌గా, ఆత‌ర్వాత టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత న‌వ‌యుగ సంస్థ‌ను ముందుకు తెచ్చారు. న‌వ‌యుగ సంస్థ య‌జ‌మానికి, ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీరావు కుటుంబంతో బంధుత్వం ఉంది. రామోజీరావు త‌న‌యుడికి స్వ‌యంగా న‌వ‌యుగ చౌద‌రి వియ్యంకుడు కావ‌డం విశేషం.

ఇక ఇప్పుడు న‌వ‌యుగ స్థానంలో మేఘా సంస్థ ముందుకొచ్చింది. ఈ మేఘా కృష్ణారెడ్డి ప్ర‌స్తుతం టీవీ9 సంస్థ‌లో కీల‌క‌వాటాదారుడు. అంటే ఈనాడు సంస్థ‌ల‌కు చెందిన కాంట్రాక్ట‌ర్ స్థానంలో టీవీ9 కాంట్రాక్ట‌ర్ ముందుకొచ్చారు. దాంతో ఇన్నాళ్లుగా ఈనాడు పేప‌ర్ లో అంతా బాగుంద‌ని క‌థ‌నాలు వ‌స్తే ఇక‌పై త‌ద్విరుద్ధ‌మైన విష‌యాలు చూస్తాం. పోల‌వ‌రంలో చిన్న చిన్న లోపాల‌ను కూడా ఇక‌పై భూత‌ద్దంలో చూపించేందుకు ఈనాడు ప్ర‌య‌త్నిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఇన్నాళ్లుగా పెద్ద పెద్ద స‌మ‌స్య‌ల‌ను కూడా క‌ప్పిపుచ్చిన వాళ్లే ఇక‌పై అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.

టీవీ9 తీరు కూడా అదే రీతిలో ఉంటుంది. ఇంత‌కాలంగా పోల‌వ‌రం ప్రాజెక్ట్ గురించి ఎంతో కొంత నెగిటివ్ ప్ర‌చారం చేసిన‌ప్ప‌టికీ ఇక‌పై పూర్తిగా పాజిటివ్ క‌థ‌నాలు మాత్ర‌మే ఆ చానెల్ తెర‌మీద మ‌నం వినాల్సి ఉంటుంది. అంటే కాంట్రాక్టులు ద‌క్కితే ఒక‌లా..త‌మ ప్ర‌యోజ‌నాలు నెర‌వేక‌పోతే మ‌రోలా వ్య‌వ‌హ‌రించేందుకు ఈ మీడియా ఎల్ల‌వేళలా సిద్ధంగా ఉంటుంద‌న్న విష‌యం పోల‌వ‌రం సాక్షిగా స్ప‌ష్టంగా చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here