ప‌రారీలో య‌న‌మ‌ల బ్ర‌ద‌ర్, పోలీసుల‌తో చిక్కులు?

0

ఏపీ మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ కీల‌క‌నేత‌ య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కుటుంబ స‌భ్యుల వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పోలీసులు న‌మోదు చేసిన కేసులో ఆయ‌న త‌ప్పించుకుంటున్న తీరు తూర్పు గోదావ‌రి జిల్లా తుని రాజ‌కీయాల్లో కీల‌కాంశంగా మారింది.

తుని నియోజ‌క‌వ‌ర్గంలో య‌న‌మ‌ల సోద‌రుడు కృష్ణుడు ఇప్ప‌టికే వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. అయిన‌ప్ప‌టికీ టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తిగా ఆయ‌న‌దే పెత్త‌నం అన్న‌ట్టుగా సాగింది. ముఖ్యంగా త‌య‌న సోద‌రుడు ఆర్థిక‌మంత్రిగా ఉండ‌డంతో తుని వ్య‌వ‌హారాల్లో య‌న‌మ‌ల కృష్ణుడు చెప్పిందే వేదంగా క‌నిపించింది.

ఈ క్ర‌మంలోనే హేచ‌రీ య‌జ‌మానులను బెదిరించి బ‌ల‌వంత‌పు వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన‌ట్టు కేసులు న‌మోద‌యిన‌ప్ప‌టికీ పోలీసులు అప్ప‌ట్లో పెద్ద‌గా స్పందించ‌లేదు. కానీ ఇప్పుడు అధికారం మార‌డంతో య‌న‌మ‌ల కుటుంబీకుల‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. య‌న‌మ‌ల అనుచ‌రులు కూడా చిక్కుల్లో ప‌డుతున్నారు. హేచ‌రీల వ‌సూళ్ల‌తో పాటు అన్న క్యాంటీన్ పై దాడి కేసులో కూడా వారు నిందితులుగా ఉన్నారు.

పోలీసులు అరెస్టుల‌కు సిద్ధ‌మ‌య్యారు. కానీ య‌న‌మ‌ల బ్ర‌ద‌ర్ కృష్ణుడు ప‌రారీలో ఉన్న‌ట్టు చెబుతున్నారు. య‌న‌మ‌ల ఇంటి వ‌ద్ద నిఘా కూడా ఉంచిన‌ట్టు స‌మాచారం. తునిలో ఇన్నాళ్ళుగా చ‌క్రం తిప్పిన నేత‌ల‌కు ఇప్పుడు చిక్కులు త‌ప్ప‌డం లేద‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here