ప‌వ‌న్ కి త‌ల‌నొప్పులు, సొంత ఎమ్మెల్యే నుంచే సెగ‌

0

ఏపీ రాజ‌కీయాల్లో జ‌న‌సేన ప‌రిస్థితి రానురాను ప‌రిమితం అవుతున్న‌ట్టు కనిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు ఆపార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. బ‌ల‌మైన నేత‌లంతా గోడ దూకేస్తుండ‌డంతో జ‌న‌సేన ప్ర‌భావం రానురాను కుచించుకుపోతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో వివాదంలో జ‌న‌సేన నేత‌లు ఇరుక్కున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే కార‌ణంగా పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటుగా కీల‌క నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ మీద కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

జ‌న‌సేన పార్టీ స‌మావేశంలో కుర్చీ విష‌యంలో నాదెండ్ల మ‌నోహ‌ర్ కామెంట్స్ ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ప‌లువురు తీవ్రంగా మండిప‌డుతున్నారు. పార్టీ త‌రుపున విజ‌యం సాధించిన ఏకైక ఎమ్మెల్యేకి ఇచ్చే గౌర‌వం ఇదేనా అనే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. పైగా ద‌ళిత వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే ప‌ట్ల నాదెండ్ల నోటికి ప‌నిచెప్ప‌డం వివాదంగా మారుతోంది.

అదే స‌మ‌యంలో మ‌నోహ‌ర్ ప‌క్క‌నే ఉన్న పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ప‌ల్లెత్తు మాట అన‌క‌పోవ‌డం, క‌నీసం వారించ‌క‌పోవ‌డం అనేక‌మందిని విస్మ‌యానికి గురిచేస్తోంది. జ‌న‌సేన ఎస్సీ సామాజిక‌వ‌ర్గానికి ప్రాధాన్య‌త‌లేదని ఇప్ప‌టికే రావెళ కిషోర్ బాబు వంటి వారు విమ‌ర్శ‌లు చేసి పార్టీ ని వీడిపోయారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాదెండ్ల మ‌నోహర్ కూడా గెల‌వ‌లేని రాజ‌కీయ ప‌రిస్థితుల్లో కేవ‌లం రాపాక వ‌ర‌ప్ర‌సాద్ రాజోలు నుంచి గెలిచి జ‌న‌సేన‌కు అసెంబ్లీలో ప్రాధాన్య‌త సాధించ‌లిగారు. అలాంటి నాయ‌కుడికి ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోగా ప‌రిహాస‌మాడ‌డం ప‌లువురిని విస్మ‌యానికి గురిచేస్తోంది. నాదెండ్ల మ‌నోహ‌ర్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌నే డిమాండ్ ప‌లువురి నుంచి వినిపిస్తోంది. పార్టీ త‌రుపున చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు జ‌న‌సైనిక‌లు నుంచి కూడా డిమాండ్స్ రావ‌డంతో పీకేకి ఏపీ పాలుపోవ‌డం లేద‌ని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here