ప‌వ‌న్ ‘ఫార్టీ’ అడుగుతున్నారు..!

0

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టాలీవుడ్ రీ ఎంట్రీ గ్రాండ్ గా ఉంటుంద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. త్వ‌ర‌లో పింక్ తో ప‌వ‌న్ మ‌ళ్లీ తెర‌మీద‌కు రాబోతున్న‌ట్టు ఇప్ప‌టికే బోనీక‌పూర్ హింట్ ఇచ్చేశారు. దాంతో ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియెన్స్ లో ఆస‌క్తి క‌నిపిస్తోంది. పీకే సెకండ్ ఇన్సింగ్ ఎలా ఉండ‌బోతోంద‌న‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింది.

ఇటీవల బోనీ కపూర్ మాట్లాడుతూ ‘‘పవన్ కళ్యాణ్ ఒప్పించాను’’ అని అయితే అన్నారు. దీంతో మళ్లీ పవర్ స్టార్ వెండితెరపై కనిపించడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. అయితే ‘పింక్’ తెలుగు రీమేక్ కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా రూ.40 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసిన‌ట్టు ప్ర‌చారం మొద‌ల‌య్యింది. అంతేకాదు, లాభాల్లో తనకు 25 శాతం వాటా కూడా ఇవ్వాలని షరతు పెట్టారట. దీనిపై నిర్మాతలు బోనీ కపూర్, దిల్ రాజు ఇంకా తమ నిర్ణయాన్ని వెల్లడించలేదని టాక్.

వాస్తవానికి ‘అజ్ఞాతవాసి’ సినిమాకు పవన్ కళ్యాణ్ సుమారు రూ.25 కోట్లు పారితోషికం తీసుకున్నారు. ఆ తరవాత ఆయన రాజకీయాలతో బిజీ అయిపోయారు. ఇలాంటి సమయంలో ఆయన ఒక సినిమా ఒప్పుకుంటే మరీ రూ.40 కోట్లు డిమాండ్ చేస్తారా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. కాగా, ‘పింక్’ సినిమాను ఇప్పటికే తమిళంలో ‘నేర్కొండ పార్వాయి’గా బోనీ కపూర్ రీమేక్ చేశారు. అజిత్ హీరోగా నటించారు. ఇప్పుడు తెలుగులో దిల్ రాజుతో కలిసి బోనీ కపూర్ రీమేక్ చేయబోతున్నారు. ‘ఓ.. మై ఫ్రెండ్, ఎమ్‌సీఏ (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి)’ చిత్రాల ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కూడా పనిచేస్తున్నట్టు టాక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేయడంతో పాటు మాటలు కూడా త్రివిక్రమ్ రాస్తున్నారని సమాచారం. అంతేకాదు, ఈ సినిమా కోసం ఇప్పటికే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెట్ కూడా వేసినట్టు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here