బాబుని ప్ర‌పంచ తీవ్ర‌వాదితో పోల్చిన వ‌ర్మ‌

0

మాజీ సీఎంపై వ‌ర్మ ఘాటు కామెంట్స్ రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ట్విట్ట‌ర్ లో ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇంటికి వ‌ర‌ద చేరిన వ్య‌వ‌హారంపై ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసి హ‌ల్ చ‌ల్ సృష్టించారు.

చంద్ర‌బాబు ఇంటిపై డ్రోన్ కెమెరాలు తిరిగిన తీరుపై టీడీపీ నేత‌లు పెద్ద వివాదం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. దానిపై ప‌లువురు స్పందిస్తున్నారు. ఈ విష‌యంలో సినీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కూడా జోక్యం చేసుకోవ‌డం విశేషంగా మారింది. తన ఇంటిపై డ్రోన్లు ఎగురుతున్నందుకు సీబీఎన్ ఎందుకు ఆందోళన చెందుతున్నాడు? ఆయనేమైనా ఒసామా బిన్ లాడిన్ లాంటివాడా? లేదా తన పెరట్లో ఏదైనా దాచుకున్నాడా? ఊరకనే అడుగుతున్నా’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు.

దాంతో చంద్ర‌బాబుని బిన్ లాడెన్ తో పోల్చిన తీరుపై టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here