బాబూ పోయే, హెరిటేజ్ పాయే..!

0

అదేంటో కొన్ని కొన్ని అలానే జ‌రుగుతాయ్. అధికారం, వ్యాపారం అన్యోన్య‌త‌ను చాటుకుంటాయి. ఎవ‌రు అధికారంలో ఉంటే వారి వ్యాపారాలు జోరందుకుంటాయి. వారి కుటుంబ స‌భ్యుల‌కు సంబంధించిన సంస్థ‌ల్లో లాభాల పంట ప‌డుతుంది. అదే విప‌క్షంలో ఉంటే ఆ వ్యాపారాలే బోల్తా ప‌డ‌తాయి. న‌ష్టాల బాట‌లో సాగుతాయి. గ‌డిచిన రెండు మూడు ద‌శాబ్దాల‌లో ఈప‌రంప‌ర సాగుతోంది. కానీ నారా చంద్రబాబు కుటుంబీకుల హెరిటేజ్ సంస్థ వ్య‌వ‌హారం మ‌రింత ఆశ్చ‌ర్యంగా ప‌త‌నం అవుతోంది.

దేశంలో షేర్ మార్కెట్ కొంత ఒడిదుడుకుల‌కు లోన‌వుతోంది. అంత‌ర్జాతీయ మార్పుల‌తో సెన్సెక్స్ ప‌రిస్థితి ఊగిస‌లాట‌లో ఉంటోంది. కానీ నారా భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణి సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న హెరిటేజ్ సంస్థ మాత్రం తిరోగ‌మ‌నంలో సాగుతోంది. గడిచిన నాలుగు నెల‌ల అనుభ‌వం గ‌మ‌నిస్తే ఆ సంస్థ షేర్ మార్కెట్ విలువ దాదాపుగా 35 శాతం కోల్పోయింది. ఏడాది కాలంలో చూస్తే స‌గానికి వ‌చ్చేసింది.

గ‌త నాలుగు నెల‌ల హెరిటేజ్ షేర్ వాల్యూ గ్రాఫ్

ఈ ప‌త‌నం ఆశ్చ‌ర్యంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు అధికారం కోల్పోయిన త‌ర్వాత జ‌రుగుతున్న మార్పుల‌కు ఇదో సంకేతంగా చెబుతున్నారు. ఆయ‌న సొంత సంస్థ షేర్ మార్కెట్ లో విలువ కోల్పోతుండ‌డం, ఆయ‌న అధికారం కోల్పోయిన కార‌ణంగా జ‌రుగుతున్న ప‌రిణామంగా భావిస్తున్నారు. హెరిటేజ్ విలువ ప‌త‌నం అవుతున్న స‌మ‌యంలోనే మిగిలిన పోటీ సంస్థ‌ల షేర్ విలువ స్థిరంగా ఉండ‌డం కూడా విశేషంగానే చెప్ప‌వ‌చ్చు.

తాజాగా ఏజీఎం లో నారా బ్రాహ్మ‌ణి మాట్లాడుతూ హెరిటేజ్ ద్వారా పాల‌సేక‌ర‌ణ పెంచ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. కానీ లాభాలు, షేర్ వాల్యూ ప‌త‌నం అవుతున్ తీరు మాత్రం యాజ‌మాన్యానికి క‌ల‌వ‌ర‌ప‌రిచే అంశంగానూ, వాటాదార్ల‌కు క‌ష్ట‌కాలంగానూ చెప్ప‌వ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here