బాహుబ‌లిని దాటేసిన ‘సైరా’

0

సైరా సీజ‌న్ మొదల‌య్యింది. సాహో ఆశించిన స్థాయిలో ఆద‌ర‌ణ ద‌క్కించుకోలేక‌పోవ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి మెగాస్టార్ మువీపై ప‌డింది. సైరా సినిమా కోసం ప్రేక్ష‌కుల్లో కూడా ఆస‌క్తి క‌నిపిస్తోంది.

చిరంజీవి 151 వ చిత్రంగా కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమాను రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. సురేంద్ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా న‌య‌న‌తార న‌టించారు. విజ‌య్ సేతుప‌తి స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఈ సినిమా బిజినెస్ ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం బాహుబ‌లి 2 రికార్డులను చెరిపేసింది. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల హ‌క్కుల‌కు గానూ ఈ సినిమా కోసం19.6కోట్లు వెచ్చించ‌డం రికార్డ్ గా మారింది. గ‌తంలో బాహుబ‌లి 16 కోట్ల‌కు అమ్ముడుపోగా, సాహో కూడా దానికి చేరువుగా నిలిచింది.

కానీ ఇప్పుడు చిరంజీవి సినిమా ముఖ్యంగా మెగా కుటుంబానికి మంచి ఆద‌ర‌ణ ఉన్న ప్రాంతంలో భారీగా హ‌క్కులు అమ్ముడు పోవ‌డం ఆస‌క్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here