బాహుభ‌ళా అనిపించుకుంటున్న సాహో

0

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ లేటెస్ట్ మువీ సాహో వేడి మొద‌ల‌య్యింది. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రుపుక‌న్న ఈ యాక్ష‌న్ మువీ కోసం ఫ్యాన్స్ ఇప్ప‌టికే వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్నఈ భారీ మువీని యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌ వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.

ఆగస్ట్ 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. `

తాజాగా ప్రీ రిలీజ్ లో సినిమా సంచ‌ల‌నంగా మారింది. భారీ రికార్డుల దిశగా వెళుతోంది. ఇప్ప‌టికే నైజాం ఏరియాలో రూ.40కోట్లు, సీడెడ్‌లో రూ.25కోట్లు, కృష్ణలో రూ.8కోట్లు, గుంటూరులో రూ.12.50కో్ట్లు, నెల్లూరులో రూ.4.50కోట్లు, వెస్ట్, ఈస్ట్ ఏరియాల్లో రూ.19కోట్లు, ఉత్తరాంధ్ర రూ.16కోట్లు .. మొత్తంగా రెండు తెలుగురాష్ట్రాల్లో రూ.125కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.

కర్ణాటకలో రూ.28 కోట్లు, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియాలో రూ.18కోట్లు, బాలీవుడ్‌లో రూ.120కోట్లు, ఓవర్ సీస్‌లో 42కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్. అంటే దాదాపు రూ.333కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. మరి వసూళ్ల పరంగా సాహో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here