బిజినెస్ లో ‘సాహో’ సంచలనం

0


డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ `సాహో` ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ బృందం అన్ని మెట్రో నగరాల్లోనూ పర్యటిస్తూ సాహో మువీ ప్రచారం సాగిస్తున్నారు. బాలీవుడ్ లో బుల్లితెర రియాలిటీ షోలలో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తూ ప్రభాస్ బిజీబిజీగా ప్రచారం చేస్తున్నారు. దానికోసం ప్రత్యేకంగా విమానం వాడుతున్న తీరు విశేషంగా మారింది.`సాహో` హిందీ రైట్స్ ని టీసిరీస్ భూషణ్ కుమార్ కి విక్రయించిన సంగతి తెలిసిందే. దాదాపు 80 కోట్ల మేర డీల్ కుదిరిందని అప్పట్లో మాట్లాడుకున్నారు. అలాగే సాహో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ 320 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది. మరో 100 కోట్లు అదనంగా నాన్ థియేట్రికల్ నుంచి వస్తుందని అంచనా వేశారు.

లేటెస్ట్ సమాచారం ప్రకారం.. సాహో డిజిటల్ రైట్స్ 42 కోట్లకు అమ్ముడు పోయినట్టు చెబుతున్నారు. తెలుగు-తమిళం-మలయాళం వెర్షన్లను గంపగుత్తగా ప్రఖ్యాత డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ చేజిక్కించుకుందని తెలుస్తోంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన `సాహో` అందుకు తగ్గట్టే ప్రీబిజినెస్ లోనూ దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద ఆ స్థాయిలో వసూళ్లను సాధించాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here