బీజేపీకి చెంప‌దెబ్బ‌:మారబోతున్న రాజ‌కీయాలు

  0

  అంతా అనుకున్న‌ట్టే జ‌రుగుతుంద‌ని ఆశించిన బీజేపీ బోల్తా ప‌డింది. అర్థరాత్రి రాజ‌కీయాలు ఎన్ని వేళ‌లా చెల్ల‌వ‌ని తేలింది. చిన్న పార్టీల‌ను మింగేద్దామ‌ని చేసిన ప్ర‌య‌త్నాలు చివ‌ర‌కు క‌మ‌ల‌ద‌ళానికి మింగుడుప‌డ‌డం లేదు. మ‌హారాష్ట్ర‌లో శ‌ర‌ద్ ప‌వార్ రాజ‌కీయాల‌తో మోడీ-షా కి చెంప‌పెట్టుగా మారింది. చివ‌ర‌కు అజిత్ ప‌వార్ మీద అవినీతి కేసులు ఎత్తివేసిన త‌ర్వాత కూడా ఆశించిన‌ది నెర‌వేర‌కపోవ‌డంతో రెంటికీ చెడ్డ రేవ‌డిలా బీజేపీ మారిపోయింది. ఈ ప‌రిణామాల త‌ర్వాత దేశ‌వ్యాప్తంగానూ బీజేపీ దూకుడుకి కొంత వ‌ర‌కూ బ్రేకులు ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది.

  ఇప్ప‌టికే గోవా, మిజోరాం, క‌ర్ణాట‌క వంటి రాష్ట్రాల్లో ఫిరాయింపుల ద్వారా బీజేపీ పై చేయి సాధించింది. కానీ మ‌హారాష్ట్ర‌లో ఖంగుతిన‌డంతో దాని ప్ర‌భావంతో ఇప్పుడు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లోనూ బీజేపీ ఆశ‌లు కుదేల‌య్యే ప్ర‌మాదం దాపురించింది. డిసెంబ‌ర్ మొద‌టి వారంలో జ‌ర‌గ‌బోతున్న ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ స‌గం సీట్లు కోల్పోయే ప్ర‌మాదం పొంచి ఉంది. దాంతో క‌ర్ణాట‌క‌లో క‌మ‌లానికి గ‌డ్డు స్థితి ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌తో హ‌స్తిన‌లో బీజేపీ పెద్ద‌లు బెంగ‌పెట్టుకుంటున్న‌ట్టుగా భావిస్తున్నారు.

  మ‌హారాష్ట్ర త‌ర్వాత మ‌ద్య ప్ర‌దేశ్ ని కాజేయాల‌ని చూస్తే ఇప్పుడు ఆదిలోనే చేతులు కాల్చుకోవాల్సి వ‌చ్చింది. శివ‌సేన‌ని చీల్చాల‌ని ఎత్తులు వేస్తే చివ‌ర‌కు ఇప్పుడు బీజేపీ నుంచి కొంద‌రు ఎమ్మెల్యేలు చేజారిపోయే ప్ర‌మాదానికి చేరింది. అదే స‌మ‌యంలో ఎన్సీపీని కాజేయాల‌ని చూస్తే క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాయి. కాంగ్రెస్ కోట‌లు కూల్చాల‌ని చూసినా ప‌నికాలేదు. ఏతావాతా ఫ‌డ్న‌విస్ రాజీనామా తో మోడీ-షా గుజరాత్ గ్యాంగ్ కి మొద‌టి ఎదురుదెబ్బ‌గా భావిస్తున్నారు. భ‌విష్య‌త్తులో రాజ‌కీయంగా మ‌రిన్ని కీల‌క ప‌రిణామాల‌కు మ‌హారాష్ట్ర వ్య‌వ‌హారం దోహ‌దం చేస్తుంద‌ని చెబుతున్నారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here