బ్రాడ్ మ‌న్ రికార్డ్ బ‌ద్ధ‌లు కొట్టిన‌ కింగ్ కోహ్లీ

0

టీమిండియా కెప్టెన్ కోహ్లీ కొత్త రికార్డ్ సృష్టించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో న‌యా చ‌రిత్ర నెల‌కొల్పాడు. టీమిండియా కెప్టెన్ గా 50వ టెస్ట్ మ్యాచ్ కి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న‌ విరాట్ కోహ్లీ ఆట‌గాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. పుణె వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ డబుల్ సెంచరీ చేశాడు. కెప్టెన్‌గా తొమ్మిదిసార్లు 150కి పైగా స్కోర్ చేసి.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కెరీర్‌లో కోహ్లీకిది ఏడో డబుల్ సెంచరీ. మొత్తంగా టెస్టుల్లో 26వ సెంచరీ నమోదుచేశాడు. అంతేకాదు.. టెస్టుల్లో ఏడు వేల పరుగుల మైలురాయిని దాటాడు కొహ్లీ. కాగా, బ్రాడ్‌మన్ ఎనిమిది సార్లు 150కి పైగా స్కోర్ చేశాడు.

జ‌డేజా రాణించి సెంచ‌రీకి చేరువ‌గా వ‌చ్చిన‌ప్ప‌టికీ 91ర‌న్స్ చేసి అవుట్ కావ‌డంతో టీమిండియా 601 ర‌న్స్ వ‌ద్ద డిక్లేర్ చేసింది. ఆత‌ర్వాత బ్యాటింగ్ కి దిగిన 15 ఓవ‌ర్ల‌లో 35రన్స్ మాత్ర‌మే చేసి 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో క‌నిపిస్తోంది. రెండో టెస్ట్ లో కూడా టీమిండియా సంపూర్ణ ఆధిక్యం దిశ‌గా సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here