బ‌న్నీ ఆ మువీని ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే..!

0

అల్లు అర్జున్ కెరీర్ లో నా పేరు సూర్య‌-నా ఇల్లు ఇండియా మువీ చాలా పెద్ద ప్ర‌భావ‌మే చూపింది. సినిమా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో సుదీర్ఘ గ్యాప్ తీసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. దాని త‌ర్వాత ఇప్పుడు అల వైకుంఠాపురంలో సినిమా ద్వారా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

త్రివిక్ర‌మ్ మువీ త‌ర్వాత వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయనున్నట్టుగా గతంలోనే ప్రకటించాడు బన్నీ. అయితే రీసెంట్ గా ఐకాన్‌ను పక్కన పెట్టేసిన‌ట్టు క‌నిపిస్తోంది. దాని క‌న్నా ముందు సుకుమార్ సినిమాను లైన్‌లోకి తీసుకువచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. సుకుమార్‌తో ఉన్న స్నేహం కారణంగా బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ముందుగా సుకుమార్ సినిమాను పూర్తి చేసి, తరువాత ఐకాన్‌ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

తన హోమ్‌ బ్యానర్‌ గీతా ఆర్ట్స్‌తో కలిసి హారికా హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. యంగ్ హీరో సుశాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్‌ విలన్‌గా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. సీనియర్‌ టబు, మలయాళ నటుడు జయరామ్‌, మురళీ శర్మలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here