బ‌య‌ట‌ప‌డిన జ‌గ‌న్ క్యాబినెట్ బ‌ల‌హీన‌త‌లు

0

జ‌గ‌న్ క్యాబినెట్ లో అన్నీ ఉన్నా అనుభ‌వం పాళ్లు బాగా త‌క్కువ‌గా ఉంద‌నే విష‌యం తాజాగా మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. ఇటీవ‌ల వ‌ర‌ద‌ల స‌మ‌యంలో కీల‌క మంత్రుల పాత్ర దానికి ద‌ర్ప‌ణం ప‌డుతోంది. స‌మ‌ర్థించుకోవ‌డానికి స‌ర్కారీ అభిమానులు ఎంత స‌ర్ధి చెప్పుకున్న‌ప్ప‌టికీ కీల‌క స‌మ‌యంలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డంలో ప‌లువురు మంత్రుల బ‌ల‌హీన‌త‌లు ప్ర‌భుత్వానికి తీవ్ర వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్ట‌డానికి దోహ‌దం చేస్తున్నాయి.

గోదావ‌రి, కృష్ణా వ‌ర‌ద‌ల స‌మ‌యంలో కీల‌క మంత్రులు ఇరిగేష‌న్, రెవెన్యూ, హోం, వ్య‌వ‌సాయ మంత్రుల పాత్ర‌ను ప‌రిశీలిస్తే దానికి ఉదాహ‌ర‌ణ‌లుగా క‌నిపిస్తాయి. రెవెన్యూ మంత్రి సీనియ‌ర్ అయిన‌ప్ప‌టికీ మిగిలిన ముగ్గురికి అనుభ‌వం లేదు. దానికార‌ణంగా నీటిపారుద‌ల మంత్రి కొన్ని సార్లు అభాసుపాల‌య్యారు. ఏకంగా 40టీఎంసీల నీటిని ప్ర‌కాశం బ్యారేజ్ వ‌ద్ద నిల్వ ఉంచామంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ కి గుర‌య్యింది.

అంత‌కుముందు గోదావ‌రి వ‌ర‌ద‌ల్లో కూడా ఆయ‌న ఒకే ఒక్క రోజు తూతూమంత్రంగా ప‌ర్య‌టించ‌డ‌మే త‌ప్ప పోలీవ‌రం ప్రాజెక్ట్, అక్క‌డి ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు సమీక్షించిన దాఖ‌లాలు కూడా లేవు. ఇక కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్న‌ప్ప‌టికీ వ్య‌వ‌సాయ‌మంత్రి వ‌ర‌ద‌ల విష‌యంలో పెద్ద‌గా స్పందించ‌లేదు. రైతులు అపారంగా న‌ష్ట‌పోయిన‌ప్ప‌టికీ కనీసం ప‌రామ‌ర్శించిన దాఖ‌లాలు లేవు. ఇక హోం మంత్రి అయితే గ‌డిచిన ప‌క్షం రోజులుగా ప్ర‌జ‌ల మ‌ధ్య క‌నిపించ‌డం లేదు.

ఈ ప‌రిస్థితుల్లో ముఖ్య‌మంత్రి విదేశాల్లో ఉండ‌డం, కీల‌క మంత్రులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌లేక‌పోవ‌డంతో వ‌ర‌ద‌ల విష‌యంలో ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ముందు దోషిగా నిలిచింది. స‌హాయం అందించ‌డంలోనూ, ఇత‌ర అంశాల్లోనూ విఫ‌ల‌మ‌య్యింద‌నే అభిప్రాయాన్ని క‌లిగించింది. ఈ ప‌రిస్థితి కొన‌సాగితే జ‌గ‌న్ స‌ర్కారుకి రాబోయే రోజుల్లో మ‌రిన్ని స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని పలువురు భావించే స్థితికి చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here