మాట మార్చిన క్రిస్ గేల్

0

వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మేన్ క్రిస్ గేల్ మాట మార్చేశాడు. తన మనసులో మాట బయటపెట్టేశాడు. దాంతో ఇప్పుడు ఈ సుడిగాలి ఆటగాడి వ్యవహారం కొత్త చర్చకు తెరలేపింది.

తాాజగా టీమిండియాతో జరుగుతున్న వన్డే సిరీస్ ఈ దిగ్గజ ఆటగాడికి చివరిదని ప్రచారం సాగింది. మూడో వన్డేలో దాదాపుగా అతడికి ఫేర్ వెల్ తరహాలో కనిపించింది. కానీ ప్రస్తుతానికి రిటైర్మెంట్‌ ప్రకటించట్లేదని, జట్టులోనే కొనసాగుతున్నానని ఈ ఓపెనర్‌ ట్విస్ట్ ఇచ్చాడు.

గతంలోనే తన రిటైర్మెంట్ విషయంపై గేల్ ప్రకటన చేశాడు. భారత్‌తో వన్డే సిరీస్‌ అనంతరం గేల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని ప్రపంచకప్‌ టోర్నీ సందర్భంగా చెప్పాడు. అందుకు అనుగుణంగానే టీ20లకు అందుబాటులో లేని గేల్‌… వన్డే సిరీస్‌కు జట్టుతో జత కట్టాడు. మధ్యలో టెస్ట్‌ సిరీస్‌కు అందుబాటులో ఉంటానని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుకు తెలిపినా అతనిని టెస్టు జట్టులో చోటు కల్పించలేదు.

ఈ నేపథ్యంలో అతని రిటైర్మెంట్‌ ప్రకటన మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆఖరి వన్డేలో గేల్‌ 41 బంతుల్లో 72 పరుగులు సాధించి ఖలీల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే గేల్‌ ఔటైన తర్వాత భారత ఆటగాళ్లంతా అతణ్ని అభినందించడం, మైదానాన్ని వీడుతూ అతడు హెల్మెట్లో బ్యాట్‌ను పెట్టి పైకెత్తి అభిమానులకు అభివాదం చేయడంతో గేల్‌కు ఇదే ఆఖరి మ్యాచ్‌ అని అంతా భావించారు. కానీ మ్యాచ్‌ ముగిసిన అనంతరం గేల్‌ తన రిటైర్మెంట్‌పై మాట్లా డుతూ.. ‘రిటైర్మెంట్‌ గురించి నేను ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఇప్పటికీ వెస్టిండీస్‌ జట్టులోనే ఉన్నాను’ అని ప్రకటించడం విశేషం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here