మూడు ఎమ్మెల్సీ సీట్లు ద‌క్కించుకున్న వైసీపీ

0
77

వైసీపీకి మండ‌లిలో బ‌లం పెరిగింది. తాజ‌గా మూడు స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవంగా కైవసం చేసుకుంది. ప్ర‌స్తుతం టీడీపీకి మండ‌లిలో సంపూర్ణ ఆధిక్యం ఉంది. ఇటీవ‌ల బ‌డ్జెట్ స‌మావేశాల్లో టీడీపీ నేత‌లు ప్ర‌భుత్వాన్ని బ‌లంగా నిల‌దీశారు.

దాంతో ఈసారి మూడు స్థానాల‌కు వైసీపీ నేత‌లు ఎంపిక కావ‌డంతో త‌మ బ‌లం పెంచుకున్న‌ట్ట‌య్యింది. నామినేష‌న్లు దాఖ‌లు చేసిన వైసీపీ అభ్య‌ర్థులు మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి, మోపిదేవి వెంకటరమణలు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు

నామినేషన్ ఉపసంహరణకు చివరిరోజు కాగా పోటీలో ముగ్గురు అభ్యర్థులు మాత్రమే ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ సందర్భంగా వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలో శాసన మండలి కార్యదర్శి, శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.బాలకృష్ణమాచార్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డిలకు శాసనమండలి సభ్యులుగా ఎంపికైనట్లు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here