మేఘా కృష్ణారెడ్డికి షాక్, 35 చోట్ల సోదాలు

0

మేఘా సంస్థ య‌జ‌మాని కృష్ణారెడ్డి..ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌లో అత్యంత బ‌ల‌మైన కాంట్రాక్ట‌ర్. అటు తెలంగాణాలో , ఇటు ఏపీలో కీల‌క‌మైన కాంట్రాక్టుల‌న్నీ ఆయ‌న‌కే ద‌క్కుతున్నాయి. ఆ క్ర‌మంలోనే ప‌లు రంగాల‌లో మేఘా సంస్థ కాలుపెడుతోంది. ఏడాది క్రితం మీడియాలో టీవీ9 లాంటి టాప్ చానెల్ ని కొనుగోలు చేసింది. త్వ‌ర‌లో ప‌త్రికారంగంలోనూ అడుగుపెట్టే ఆలోచ‌న చేస్తున్నారు.

అయితే తాజాగా మేఘా సంస్థ‌కు ఐటీ బృందాలు షాకిచ్చాయి. అనూహ్యంగా త‌నిఖీలకు పూనుకున్నాయి. హైద‌రాబాద్, విజ‌య‌వాడ స‌హా ప‌లు ప్రాంతాల‌లో సోదాలు చేప‌ట్టాయి. గురువారం అర్థ‌రాత్రి నుంచి ఈ ప‌ని సాగుతోంది. ఇప్ప‌టికే ప‌లు కీల‌క‌మైన డాక్యుమెంట్లు, కంప్యూట‌ర్ రికార్డులు స్వాహా చేసుకున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఇల్లు, గెస్ట్ హౌస్ లు స‌హా 35 చోట్ల సాగుతున్న ఈ సోదాల‌లో పెద్ద సంఖ్య‌లో ఐటీ సిబ్బంది పాల్గొన్నార‌నే చెబుతున్నారు. హైదరాబాద్‌లో నాలుగు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. బాలానగర్‌, జూబ్లీహిల్స్ చెక్ పోస్టులోని కార్యాలయం, ఎంసీహెచ్‌ఆర్డీ సమీపంలోని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఐటీ అధికారుల నుంచి ఎటువంటి ధృవీక‌ర‌ణ లేదు. ఐటీ దాడుల‌పై కంపెనీ స్పందించింది. ఇవి రెగ్యుల‌ర్ ప‌రిశీల‌న మాత్ర‌మేన‌ని, ఎటువంటి సోదాలు, దాడులు జ‌ర‌గ‌డం లేద‌ని మేఘా సంస్థ చెబుతోంది. ఇటీవ‌లే మైహోమ్స్ య‌జ‌మాని రామేశ్వ‌ర‌రావు పై కూడా ఐటీ దాడులు జ‌రిగాయి. ఇప్పుడు ఆయ‌న భాగ‌స్వామి మేఘా సంస్థ మీద కూడా దాడుల‌కు పూనుకోవ‌డం వెనుక పెద్ద స్కెచ్ ఉండ‌వ‌చ్చ‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here