మోడీ మీద ఆశ‌లు పెట్టుకున్న చంద్ర‌బాబు..!

0

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆశ‌ల‌న్నీ కేంద్రం మీదే ఉన్నాయి. బీజేపీ నిర్ణ‌యం మీద త‌న భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంద‌ని ఆయ‌న అంచ‌నాలు వేస్తున్నారు. అంతేకాదు…స్వ‌యంగా చంద్ర‌బాబు త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టుకున్నారు. ముంద‌స్తు మీద గంపెడాశ‌తో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. జమిలీ ఎన్నిక‌లు ఖాయ‌మ‌ని ఆయ‌న చెబుతున్న మాట‌లు దానికి త‌గ్గ‌ట్టుగానే ఉన్నాయి.

దేశంలో జ‌మిలీ ఎన్నిక‌ల మీద ప్ర‌చారం సాగుతోంది. మోడీ కూడా అదే ఆలోచ‌న‌లో ఉన్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అదే జ‌రిగితే ఏపీలో ప్ర‌భుత్వం మూడేళ్ల‌కే మూటా ముళ్లె స‌ర్థుకోక త‌ప్ప‌ద‌నే అబిప్రాయం ఉంది. 2022 నాటికే దేశంలో జ‌మిలీ ఎన్నిక‌లు ఖాయం అని ప‌లువురు అంచ‌నాలు వేస్తున్నారు. అలాంటి వారిలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి వారు కూడా ఉన్నారు. సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చూసిన త‌మ‌కు మ‌రో అవ‌కాశం త్వ‌రలోనే ఉంద‌ని ఈ నేత‌లు న‌మ్ముతున్నారు.

చంద్ర‌బాబు త‌న అభిప్రాయాన్ని మీడియా ముందు వెళ్ల‌డించారు. ముందుస్తు ఎన్నిక‌లు ఖాయ‌మ‌ని, వైఎస్ జ‌గ‌న్ వైఫ‌ల్యాల‌తో ప్ర‌జాగ్ర‌హానికి గురి అవుతార‌ని అప్పుడే జోస్యం చెబుతున్నారు. జ‌న‌సేనాని కూడా ఇదే విష‌యాన్ని అంత‌రంగీకుల ముందు వెల్ల‌డించారు. దిండిలో జ‌రుగుతున్న స‌మావేశంలో ముంద‌స్తు ఎన్నిక‌లు, దానికి స‌న్నాహాల‌కు త‌గ్గ‌ట్టుగా శ్రేణుల‌ను సిద్ధం చేయ‌డ‌మే ల‌క్ష్యం అన్న‌ట్టుగా మాట్లాడార‌ని ఆపార్టీ నేత‌లు చెబుతున్నారు. ఇప్ప‌టికే విస్తృత చ‌ర్చ జ‌రుగుతున్న ఈ జ‌మిలీ చుట్టూ ఇప్పుడు ఈ జంట నేత‌ల అంచ‌నాలు ఏమేర‌కు వాస్త‌వ రూపం దాలుస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here