మ‌ళ్లీ అగ్ర‌స్థానంలో కింగ్ కోహ్లీ

0

టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లో మ‌ళ్లీ విరాట్ కోహ్లీ ముందుకొచ్చాడు. స్టీవ్ స్మిత్ ను వెనక్కి నెట్టి టాప్ సీటులోకి వ‌చ్చాడు. పింక్ టెస్టులో డ‌బుల్ సెంచ‌రీతో కోహ్లీ క‌దం తొక్క‌గా, ఇటీవ‌ల పాక్ సిరీస్ లో స్మిత్ ఆశించిన మేరకు రాణించ‌క‌పోవ‌డంతో వారిద్ద‌రి స్థానాలు అటూ ఇటూ అయ్యాయి. 928 పాయింట్ల‌తో కోహ్లీ ముంద‌జ వేయ‌గా, 923 పాయింట్ల‌తో స్టీవ్ స్మిత్ రెండో స్థానానికి ప‌డిపోయాడు.

ఇక మూడో స్థానంలో కేన్ విల‌య‌మ్సన్ 877 పాయింట్ల‌తో ఉన్నాడు. నాలుగో స్థానంలో ఛ‌టేశ్వ‌ర్ పుజారా, ఆరో స్థానంలో అజింక్యా ర‌హానే నిలిచారు. దాంతో టాప్ 10లో ముగ్గురు టీమిండియా ఆట‌గాళ్లున్నారు. ట్రిపుల్ సెంచ‌రీతో క‌దం తొక్కిన డేవిడ్ వార్న‌ర్ టాప్ 5 కి చేర‌గా, డ‌బుల్ సెంచ‌రీ సాధించిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఏడో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా యువ సంచ‌న‌లం లంబ‌షేన్, కివీస్ బ్యాట్స్ మేన్ హెన్రీ, శ్రీలంక క‌రుణ‌ర‌త్నే త‌దుప‌రి స్థానాల్లో టాప్ 10 లిస్టులో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here