మ‌హారాష్ట్రలో బీజేపీకి మ‌రో షాక్

  0

  మ‌హారాష్ట్ర‌లో త‌గిన బ‌లం లేక‌పోయినా ప్ర‌భుత్వం ఏర్పాటు కోసం ప్ర‌య‌త్నించి భంగ‌ప‌డ్డ బీజేపీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే మ‌రాఠీ గ‌డ్డ మీద క‌మ‌లం గూటిలో ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి. త్వ‌ర‌లో ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు పార్టీని వీడ‌బోతున్నారంటూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో కేంద్ర మాజీ మంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన ఆరోప‌ణ‌ల‌తో ఫ‌డ్న‌విస్ మ‌రింత ఇర‌కాటంలో ప‌డ్డారు.

  కేంద్రం నుంచి వ‌చ్చిన 40వేల కోట్ల నిధుల వినియోగం విష‌యంలో మ‌రోసారి అధికారం చేప‌ట్ట‌డం ద్వారా బ‌య‌ట‌ప‌డాల‌ని ఫ‌డ్న‌విస్ ప్ర‌య‌త్నించిన‌ట్టు అనంత్ కుమార్ ఆరోపించారు. వాటిని ఫ‌డ్న‌విస్ వెంట‌నే ఖండించారు. కానీ కేంద్ర ప్ర‌భుత్వ నిధులు దుర్వినియోగం విష‌యంపై విచార‌ణ జ‌ర‌గాలంటూ ప‌లువురు నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. దాంతో బీజేపీకి ఈ వ్య‌వ‌హారం పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. అదే పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌డంతో బీజేపీకి స‌మ‌స్య‌గా మారింది.

  అదే స‌మయంలో మాజీ మంత్రి పంక‌జ్ ముండే పార్టీని వీడేందుకు ముహూర్తం నిర్ణ‌యించుకున్నారు. డిసెంబ‌ర్ 12న ఆమె బీజేపీని వీడి శివ‌సేన‌లో చేర‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆమె ట్విట్ట‌ర్ లో బీజేపీ నేత అనే బ్రాండ్ ని తొల‌గించారు. గ‌తంలో మంత్రిగా ప‌నిచేసిన పంక‌జ్ ముండే మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. గోపీనాథ్ ముండే కుమార్తెగా రాజ‌కీయ ఆరంగేట్రం చేసిన పంక‌జ్ త‌ర్వాత పలువురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీని వీడే యోచ‌న‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారం ఊపందుకుంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here