మ‌హేష్ బాబు కి మ‌ళ్లీ బ్రేక్

0

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మ‌రోసారి బ్రేక్ కి సిద్ధ‌మ‌వుతున్నాడు. గ‌తంలో ఏకంగా మూడేళ్ల పాటు సినిమా రంగానికి దూరంగా గ‌డిపిన మ‌హేష్ ఈసారి మ‌ళ్లీ బ్రేక్ తీసుకోవాల‌నుకోవ‌డం ఆస‌క్తిగా మారింది.

ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు స‌రిలేరు నీకెవ్వ‌రూ అనే సినిమా ముగింపు ప‌నిలో ఉన్నారు. ఆ త‌ర్వాత సంక్రాంతికి సినిమా జ‌నం ముందుకు రాబోతోంది. ఇటీవ‌ల వ‌రుస హిట్ల‌తో ఊపుమీదున్న మ‌హేష్ బాబుకి ఈ సినిమా కూడా గ్రాండ్ హిట్ అవుతుంద‌నే అంచ‌నాలో అభిమానులున్నారు.

అయితే ఆ సినిమా త‌ర్వాత మూడు నెల‌ల పాటు విరామం తీసుకోబోతున్న‌ట్టు న‌మ్ర‌త ప్ర‌క‌టించారు. కుటుంబంతో క‌లిసి ఎంజాయ్ చేయ‌డం కోసం ఈ గ్యాప్ తీసుకుంటున్న‌ట్టు ఆమె తెలిపారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సెట్ లో అడుగుపెట్టే అవ‌కాశం ఉంటుంది. త‌దుప‌రి సినిమా ప‌నులు కూడా విరామం త‌ర్వాతే ఉంటాయ‌ని చెబుతున్నారు.

మ‌హేష్ బాబు మేన‌ల్లుడు గల్లా అశోక్

   సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడు తెలుగు సినీ తెరకు పరిచయం కానున్నాడు. కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నవంబర్ 10న కొత్త చిత్రం ప్రారంభం కానుంది. కృష్ణ కుమార్తె, గల్లా జయదేవ్ భార్య పద్మావతి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనుండగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పీఆర్వో బీఏ రాజు వెల్లడించారు. దీన్ని చూసిన ఘట్టమనేని ఫ్యాన్స్ ఈ సినిమా విజయవంతం కావాలని కోరుతూ, అశోక్ కు అభినందనలంటూ కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here