యువీ మీద గురిపెట్టిన టెన్నీస్ బ్యూటీ

0
91

టెన్నీస్ బ్యూటీ సానియా మీర్జా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఈసారి ఆమె టీమిండియా మాజీ స్టార్ యువ‌రాజ్ మీద గురిపెట్టింది. ట్విట్ట‌ర్ లో ట్రోలింగ్ చేసింది. ఇటీవ‌ల యువీ ప‌లు విష‌యాల‌ను సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ కి షేర్ చేస్తున్నాడు. అందులో భాగంగానే యువీ పోస్ట్‌ చేసిన ఒక ఫోటో వైరల్‌గా మారింది. క్లీన్‌ షేవ్‌తో కొత్త లుక్‌లో ఉన్న ఫోటోను యువీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దీనికి ‘చిక్నా చమేలా’ లుక్‌ ఎలా ఉందంటూ కింద క్యాప్షన్‌ ఇచ్చాడు.

మరొకవైపు తాను మళ్లీ గడ్డాన్ని పెంచాలని అనుకుంటున్నారా అని అభిమానుల్ని ప్రశ్నించాడు. ఇందుకు టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా స్పందించారు. ఈ లుక్‌ దాదాపు బాలేదని అర్ధం వచ్చేలా రిప్లై ఇచ్చిన సానియా.. మళ్లీ యువీని గడ్డంతో చూడాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ‘ గడ్డాన్ని తీసేసి నీ అట్రాక్టివ్‌ లుక్‌ను దాచేశావా’ అంటూ బదులిచ్చారు. మళ్లీ గడ్డం పెంచూ అంటూ యువీని ట్రోల్‌ చేశారు సానియా.

దాంతో వారిద్ద‌రి చ‌ర్చ ఆస‌క్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here