యువీ మెరుపులు అక్క‌డ కూడా చూడ‌లేం..!

0

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. బీసీసీఐ ఆధ్వర్యంలో టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించిన యువీ.. ఆ తర్వాత విదేశాల్లో జరిగే దేశీవాలీ లీగ్ లు ఆడేందుకే ఆసక్తి చూపిస్తున్నాడు. గ్లోబల్ టీ 20 కెనడా టీ20 లీగ్ లాంటి విదేశీ టోర్నమెంట్లలోనే కనిపిస్తున్నాడు. 

ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్‌లో మరాఠా అరేబియన్స్ కు ఆడుతున్న యువరాజ్ ను ఐపీఎల్ ముంబై ఇండియన్స్ వేలానికి విడిచిపెట్టేసింది. బీసీసీఐ నియమాల ప్రకారం విదేశీ లీగ్‌లు అంటే బీబీఎల్, సీపీఎల్ లాంటి వాటిలో ఆడుతుంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. దాంతో పాటు బీసీసీఐ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిందే. 

ఇవన్నీ తెలిసి విదేశీ లీగ్ లలో ఆడేందుకు సిద్ధమైన యువరాజ్ కచ్చితంగా ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకునేట్లుగా కనిపిస్తున్నాడు. ఇటీవల దీని గురించి మాట్లాడిన యువీ.. ‘నేను ఈ దశలో కెనడాలో ఆడటాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా. దురదృష్టవశాత్తు కరేబియన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ కుదరక ఆడలేకపోతున్నా. ఒక సంవత్సరంలో రెండు, మూడు ఫార్మాట్లలో ఆడుతుండటం గొప్పగా అనిపిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినా ఈ రెండు మూడు టోర్నమెంట్ లలో ఆడగల్గుతున్నా’ అని చెప్పుకొచ్చాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here