రామ్ చ‌ర‌ణ్ విల‌న్ తో చిరంజీవికి డ‌బ్బింగ్

0

సైరా సీజ‌న్ ప్రారంభ‌మ‌య్యింది. అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్త రిలీజ్ నేప‌థ్యంలో స‌న్నాహాలు షురూ అయ్యాయి. తెలుగుతో పాటుగా వివిధ భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల కాబోతోంది.

‘రేనాటి వీరులారా! చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కానీ, చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి’ – ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌లో డైలాగ్‌ ఇది. చిరంజీవి వాయిస్‌లో మరింత గంభీరంగా వినిపించింది. తెలుగు తెరపైన ఆయన గొంతే వినిపిస్తుంది. ఆయనే కనిపిస్తారు. కానీ ఇత‌ర భాష‌ల్లో ఆయ‌న అభిన‌యానికి త‌గ్గ‌ట్టుగా ఉండే గొంతు కోసం సైరా టీమ్ వెదికింది. చివ‌ర‌కు త‌మిళంలో అరవింద్‌ స్వామి గొంతులో ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి భావావేశం క‌నిపించ‌బోతున్న‌ట్టు చెబుతున్నారు.

తమిళ వెర్ష‌న్ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చిరంజీవి పాత్రకు అరవింద్‌ స్వామి డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా నిర్మాత, చిరు తనయుడు రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘ధృవ’లో అరవింద్‌ స్వామి ప్రతినాయకుడిగా నటించారు. ఆ చిత్రానికీ, ‘సైరా..’కూ సురేందర్‌రెడ్డి దర్శకుడు. కథానాయకుడు, దర్శకుడితో అరవింద్‌ స్వామికి సత్సంబంధాలు ఉన్నాయి. తమిళంలో చిరంజీవికి తాను డబ్బింగ్‌ చెబుతానని అరవింద్‌ స్వామి స్వయంగా రామ్‌చరణ్‌కు ఫోన్‌ చేశారట. అంతే కాకుండా స్వచ్ఛమైన తమిళంలో కొన్ని డైలాగులు చెప్పి… వాయిస్‌ ఫైల్స్‌ను చిరంజీవికి పంపారని తెలిసింది. తండ్రితో చరణ్‌ మాట్లాడటం, చిరంజీవి ఓకే అనడం వెంట వెంటనే జరిగాయని సమాచారం. అలాగే, సినిమాకు తమిళంలో కమల్‌ హాసన్‌, మలయాళంలో మోహన్‌లాల్‌ వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారు. తెలుగులో పవన్‌ కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here