రామ‌చంద్ర‌మూర్తికి ఆరు ప్ర‌శ్న‌లు

0

మీడియాను నియంత్రించేందుకు ఏపీ ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌పై ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విడుద‌ల‌యిన జీవోని స‌మ‌ర్థించేందుకు ప్ర‌భుత్వ పెద్ద‌లు కూడా ప‌లు ప్ర‌యాస‌లు ప‌డాల్సి వ‌స్తోంది. ఏకంగా రామోజీ, రాధాకృష్ణ కోస‌మే ఈ జీవోని తీసుకొచ్చామంటూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్య‌లు స‌ర్కారు తీరును చాటుతోంది.

అదే స‌మ‌యంలో కొంత‌కాలం క్రితం వ‌ర‌కూ ప్ర‌జాస్వామ్య వాదులుగా, జ‌ర్న‌లిస్ట్ సంఘాల నేత‌లుగా ఎన్నో వేదిక‌ల మీద ఉప‌న్యాసాలు దంచిని కే రామ‌చంద్ర‌మూర్తి, దేవుల‌ప‌ల్లి అమ‌ర్ వంటి వారు కూడా ప్ర‌స్తుతం ఈ జీవోని స‌మ‌ర్థించ‌డానికి తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. గ‌తంలో తాము చేసిన వ్యాఖ్య‌ల‌కు భిన్నంగా ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న త‌రుణంలో మాట్లాడుతున్నామ‌నే విష‌యాన్ని మ‌ర‌చిన‌ట్టున్నారు.

ఆ క్ర‌మంలోనే తాజాగా రామ‌చంద్ర‌మూర్తి మీడియా స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌లు ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. సోష‌ల్ మీడియా సాక్షిగా ఆయ‌న్ని ఎండ‌గ‌ట్టేందుకు ప‌లు అంశాలు సంధిస్తున్నారు. వాటికి స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీస్తున్నారు.

వాటిలో కొన్ని..

  1. తాను ప్రభుత్వం ఇచ్చే ప్రతి జీవోను సమర్థిస్తానని రామ‌చంద్ర‌మూర్తి అన్నారు.

ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రతి జీవోనేనా, లేక ఏ ప్రభుత్వంలో ఏ జీవోనైనా ఇంతే గుడ్డిగా సమర్థిస్తారా?

  1. తప్పు వార్తలు రాసిన ఎవరైనా సరే కోర్టుకు తిరగాల్సిందేనని… 30 ఏళ్ల నుంచి తాను తిరుగుతున్నానని చెప్పారు.

ఆధారాలు లేకుండా, అన్ని తప్పుడు వార్తలు ఎలా రాశారండీ?

3.ఆ జీవోలో కొత్తగా ఏమీ లేదు.

ఏవీ లేనప్పుడు, కొత్త జీవో అవసరం ఏంటన్న ప్రశ్నకి సమాధానామైనా ఉందా?

  1. ఇప్పుడు శాఖాధిపతులు, అధికారులకు దాన్ని కట్టబెడుతూ స్వల్పమార్పులు చేశాం.

కొత్తగా ఏమీ లేదంటూనే మళ్లీ స్వల్ప మార్పులు చేశారంటారేమిటి?

  1. తప్పుడు వార్తలు రాస్తే కేసులు వేసే అధికారం ఇంతకుముందు సమాచార శాఖ కమిషనర్‌కు ఉండేది.

అదే నిజమైతే, ఆ అధికారాన్ని ఉపయోగించి, 2014 నుంచి 2019 వరకు అప్పటి సమాచార కమిషనర్ ఎంతమంది జర్నలిస్టుల మీద, మీడియా సంస్థల మీద కోర్టులో కేసులు పెట్టారో చెబితే బాగుంటుందేమో?

  1. మీడియా వాళ్లు సమాచారం కోసం వస్తే సహకరించాలని కూడా అధికారులను ఆదేశిస్తారా అని ప్రశ్నించగా… మీడియాను ఎలా డీల్‌ చేయాలో ముస్సోరి అకాడమీలో ఐఏస్ లకు శిక్షణ సందర్భంగా నేర్పిస్తారని చెప్పారు.

మరి అంత నేర్చుకున్న వారికి, ఈ కొత్త జీవో ఇచ్చి జర్నలిస్టుల మీద కేసులు ఎలా వెయ్యాలో ఎందుకు నేర్పడం?

ఇప్పుడీ ప్ర‌శ్న‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వ పాల‌సీ స‌ల‌హాదారు ఏం స‌మాధానం చెబుతార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here