రామ‌చంద్ర‌మూర్తి అలా అంటే..రాధాకృష్ణ ఇలా అనేస్తారా..!

0

రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య వైరం ఏ స్థాయిలో సాగుతుందో అంద‌రికీ తెలుసు. కానీ ఇప్పుడు మీడియా పెద్ద‌ల మ‌ధ్య రాత‌ల యుద్ధం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఏపీలో మీడియా నియంత్ర‌ణ కోసం వెలువ‌డిన 2340 జీవో సాక్షిగా వ్య‌వ‌హారం ముదురుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. మాజీ ఆంధ్ర‌జ్యోతి ఎడిట‌ర్, ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా ఉన్న రామ‌చంద్ర‌మూర్తి కి, ఆంధ్ర‌జ్యోతి అధినేత రాధాకృష్ణ‌కు మ‌ధ్య లేఖ‌ల యుద్ధం ఇప్పుడు బ‌హిరంగ‌మ‌య్యింది.

వాస్త‌వానికి రాధాకృష్ణ కొత్త ప‌లుకులో రాసిన రాత‌ల‌తో తీవ్ర మ‌న‌స్తాపం చెందిన రామ‌చంద్ర‌మూర్తి త‌న ఆవేద‌న‌ను, ఆంధ్ర‌జ్యోతిలో త‌న అనుభ‌వాల‌ను మిళితం చేసి భారీ లేఖాస్త్రం సంధించారు. దానిని రాధాకృష్ణ బ‌హిరంగం చేస్తూ, త‌న స‌మాధానం కూడా ఎడిటోరియ‌ల్ పేజీలో రాసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా హెచ్ ఎం టీవీ లో సిబ్బంది కోసం ప్ర‌య‌త్నం చేస్తూ సాక్షిని ఉద్దేశించి రామ‌చంద్ర‌మూర్తి ఎవ‌రి ద‌గ్గ‌రో అన్న‌ట్టుగా చెబుతున్న ‘ర‌క్త‌పు కూడా ఎన్నాళ్ళు తింటావ్’ అనే మాట హైలెట్ గా మారింది.

వాస్త‌వానికి రాధాకృష్ణ‌కు త‌ప్ప ఇలాంటి ద‌మ్ము మ‌రెవ‌రికీ లేద‌నే చెప్పాలి. త‌న మీద విమ‌ర్శ‌ల‌ను కూడా ఎడిట్ చేయ‌కుండా నేరుగా సొంత ప‌త్రిక‌లో ప్ర‌చురించే ఏకైక సంస్థ ఆంధ్ర‌జ్యోతి. దాని య‌జ‌మానిగా రాధాకృష్ణ మ‌రోసారి త‌న మార్క్ వ్య‌వ‌హారం ప్రారంభించ‌న‌ట్టుగా క‌నిపిస్తోంది. అయితే ఇప్పుడు ఆంధ్ర‌జ్యోతి య‌జ‌మాని ప్రారంభించిన ఈ గేమ్ ఎలాంటి మ‌లుపులు తిరుగుతుంద‌న్న‌దే ఆస‌క్తి, కానీ మీడియా వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం రాధాకృష్ణ దూకుడు ముందు రామ‌చంద్ర‌మూర్తి నిల‌వ‌లేర‌ని, కాబ‌ట్టి ఆయ‌న దానిని పొడిగించే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు. కానీ ఇప్పుడు ప్ర‌భుత్వ ప‌ద‌విలో ఉన్నంలో నిజంగా రామ‌చంద్ర‌మూర్తి అలా చేస్తారా లేక స‌ర్కారు అండ‌తో చెల‌రేగ‌బోతున్నారా అన్న‌దే చ‌ర్చ‌నీయాంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here