ర‌కుల్ భంగిమ‌కు బోలెడు రెస్పాన్స్

0

అగ్ర కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాముఖ్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె క్రమం తప్పుకుండా వ్యాయామం చేస్తూనే ఉంటారు. ఇప్పటికే పలు సందర్భాల్లో జిమ్‌లో దిగిన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేశారు. కాగా రకుల్‌ యోగా కూడా చేస్తున్నారు. వస్త్రాల సహాయంతో శరీరాన్ని తలకిందులుగా ఉంచి.. కాళ్లతో నమస్కారం చేస్తున్న ఫొటోను ఈ బ్యూటీ శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ఈ ప్రపంచానికి ఇన్వర్టెడ్‌ నమస్తే. అన్షుక (ట్రైనర్‌) మీరు లైఫ్‌ ఛేంజర్‌’ అంటూ యోగా, ధ్యానం, మౌనం అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు. దీనికి అన్షుక స్పందిస్తూ.. కృతజ్ఞురాల్ని అని పోస్ట్‌ చేశారు.


రకుల్‌ ఈ ఫొటో షేర్‌ చేసిన గంటలోనే 1.50 లక్షల మందికిపైగా లైక్‌ చేయడం విశేషం. ఆమె అంకితభావాన్ని, ఆరోగ్యం పట్ల ఆమెకున్న శ్రద్ధను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ భామ ఇటీవల ‘మన్మథుడు 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ‘భారతీయుడు 2’లో నటిస్తున్నారు. కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here