ర‌ణ‌బీర్ ప్లేస్ లోకి రెబ‌ల్ స్టార్!

0

అర్జున్ రెడ్డి’.. తెలుగు సినీ ఇండస్ట్రీనే కాదు అనేక భాష‌ల్లో రీమేక్ అయ్యి కుర్ర కారును ఉర్రూత‌లూగించింది. హిందీలోనూ రీమేక్ అయ్యి సూపర్ డూప‌ర్ హిట్ అందుకోవ‌టంతో పాటు 2019లో అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నిలిచింది.  చిత్ర దర్శకుడు సందీప్ పై దాదాపు అన్ని భాష‌ల నిర్మాత‌లూ దృష్టి సారించారు.  అయితే సందీప్ మాత్రం తెలుగు సినిమాలకు దూరం కాకూడదని ద‌ని నిర్ణ‌యించుకున్నాడు.   తాజాగా ఆయ‌న  మ‌రో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ద‌మ‌వుతూ మాఫియా బ్యాగ్‌డ్రాప్‌లో ఓ  కథ రాసుకుని ప్రిన్స్ మ‌హేష్‌కి చెప్పాడ‌ని, అది నచ్చని మ‌హేష్ ప‌లు సూచ‌న‌లు చేసి తీసుకురావాల‌ని చెప్ప‌డంతో ఈ ప్రోజ‌క్టు హోల్డ్‌లో ప‌డింది.  దీంతో  ఈ క్రేజీ డైరెక్టర్  బాలీవుడ్ నిర్మాత ఆహ్వానం మేర‌కు  ఓ హిందీ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించేందుకు రంగం సిద్దం చేసుకున్నాడ‌ట‌.


లవర్ బాయ్ రణబీర్ కపూర్ హీరోగా  పక్కా మాస్ మసాలా సినిమాను ‘డెవిల్ పేరుతో అంతా సిద్ద‌మైన త‌రుణంలో  అనూహ్యంగా ర‌ణ‌బీర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవ‌టంతో ఈ డార్క్ స‌బ్జెక్టును బాహుబ‌లి ప్ర‌భాస్‌కి వినిపించి ఒప్పించాడ‌ని స‌మాచారం. బాహుబ‌లి చిత్రంలో విశ్వ ఖ్యాతి అందుకున్న ప్ర‌భాస్‌తో సినిమా తీస్తే, ఏ భాష‌లోనైనా అనువ‌దించుకునే ఆస్కారం ఉంద‌ని నిర్మాత‌లు కూడా ఎగిరి గంతేశార‌ట‌. వ‌చ్చే ఏడాది మార్చి, ఏప్రియ‌ల్ నెల‌లలో ఈ చిత్రానికి గుమ్మ‌డికాయ కొట్టేసి, ప‌ట్టాలెక్కించే అవ‌కాశాలున్నాయ‌ని ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో విన‌వ‌స్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here