ర‌ఫా ఎందుక‌లా చేస్తున్నాడో..!

0

టెన్నిస్ సూప‌ర్ స్టార్ ర‌ఫా నాదెల్ వ్య‌వ‌హారం నిత్యం ఆస‌క్తిగానే ఉంటుంది. స్పెయిన్‌కు చెందిన మరియా ఫ్రాన్సిస్కా తో ఈ స్టార్ ఆట‌గాడు రిలేష‌న్ కొన‌సాగిస్తున్నాడు. 12 ఏళ్లుగా వీళ్లిద్ద‌రూ క‌లిసి ఉంటున్నారు. అయినా పిల్ల‌ల విష‌యం గురించి మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ర‌ఫా సమ‌కాలీన ఆట‌గాళ్లు రోజ‌ర్ ఫెద‌ర‌ర్, అండీ ముర్రే, జ‌కోవిచ్ వంటి వాళ్లు దానికి భిన్నంగా సాగుతున్నారు

అయినా 32 ఏళ్ల నడాల్‌, 31 ఏళ్ల మరియా మాత్రం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు కన్పించడంలేదు. టెన్నిస్‌పట్ల తన అనురక్తి, కమిట్‌మెంట్‌తోపాటు ఆ ఆట ఆడడంలో తాను పొందుతున్న ఆనందానికి ఆటంకాలు కలగకూడదనే పెళ్లి, పిల్లలు వద్దనుకుంటున్నాడు రఫా. ‘టెన్నిస్‌తోపాటు గర్ల్‌ఫ్రెండ్‌తో జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నా. జీవితంలో కొన్ని నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకోలేను’ అని నడాల్‌ అంటాడు. ‘వాస్తవంగా ఈ వయస్సుకల్లా నేను మాజీ ఆటగాడిని కావాలి. అలాగే పిల్లలతో నాకంటూ ఓ ఫ్యామిలీ ఉండాలి’ అని అంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here