లోకేశ్ కి సినిమా క‌ష్టాలు..!

0

క‌ర‌వ‌మంటే క‌ప్పకు కోపం..విడ‌వ‌మంటే పాముకి కోపం అనే నానుడి విన్నారా.. ఇప్పుడు టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సోష‌ల్ మీడియా ఇన్ఛార్జ్ నారా లోకేశ్ అలాంటి ప‌రిస్థితి ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయ‌న‌కు సినిమా క‌ష్టాలు ఎదుర‌య్యాయి. ఆయ‌న చేసిన ట్వీట్ తో ఇప్పుడు సొంత వ‌ర్గంలోనే చేటు వ‌స్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. కోరి క‌ష్టాల్లో ఇరుక్కుంటున్న‌ట్టుగా ఉంద‌ని ప‌లువురు టీడీపీ నేత‌లు కూడా భావించే ప‌రిస్థితి వ‌చ్చింది.

ప్ర‌భాస్ తాజా చిత్రం సాహో సినిమాకు సంబంధించి టీడీపీ నేత‌లు దుష్ప్ర‌చారం చేస్తున్న‌ట్టు కొన్ని క‌థ‌నాలు వ‌చ్చాయి. దాంతో వాటిపై నారా లోకేశ్ స్పందించారు. తాను సాహో సినిమా కోసం ఎదురుచూస్తున్నాన‌ని, స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాన‌ని చెబుతూనే తాను చూస్తానూ మీరు చూడండి అంటూ త‌న అభిమానుల‌కు విజ్ఞప్తి చేశారు. టీడీపీ మీద చేస్తున్న ప్ర‌చారాన్ని తిప్పికొట్టే క్ర‌మంలో లోకేశ్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు కొంద‌రిని అసంతృప్తికి గురిచేస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన మ‌ద్ధ‌తుదారులుగా ఉన్న వ‌ర్గాల్లో ఇప్ప‌టికే ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. త‌మ అసహ‌నాన్ని సోష‌ల్ మీడియా సాక్షిగా వ్య‌క్తం చేస్తున్నారు. ఒక పార్టీ నేత‌గా ఉన్న లోకేశ్ ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌డం త‌మ‌కు న‌చ్చ‌లేదంటూ ప‌లువురు మండిప‌డుతున్నారు. ప్ర‌భాస్ అభిమానుల‌ను సంతృప్తి ప‌రిచే ల‌క్ష్యంతో ఇలాంటి చేష్ట‌ల‌కు దిగితే రేపు అంద‌రి ఫ్యాన్స్ ని సంతృప్తి ప‌ర‌చాల్సిన బాధ్య‌త ఉంటుంద‌నే విష‌యాన్ని లోకేశ్ మ‌రిచిన‌ట్టున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు ఎదుర్కోవాలే త‌ప్ప ఇలాంటి ట్వీట్ల‌తో అంద‌రికీ త‌ల‌వంపులు తీసుకొచ్చే ప‌ని వ‌ద్దంటూ ప‌లువురు సూచిస్తున్నారు. మొత్తంగా సాహో సినిమా కార‌ణంగా లోకేశ్ చిక్కులు ఎదుర్కోవాల్సి రావ‌డం విశేషంగా మారుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here