ల‌క్ష్మీపార్వ‌తికి న్యాయం చేసిన జ‌గ‌న్!

0

వైఎస్సార్సీపీలో కీల‌క మ‌హిళా నేత‌గా శ్ర‌మించిన నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తికి గుర్తింపు ద‌క్కింది. జ‌గ‌న్ ఆమెకు క్యాబినెట్ హోదా ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. తెలుగు అకాడ‌మీ చైర్ ప‌ర్స‌న్ గా ఎంపిక చేశారు. దాంతో సుదీర్ఘ‌కాలం త‌ర్వాత ఆమెకు ప‌ద‌వీ యోగం ద‌క్కింది. గ‌తంలో ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో 25 ఏళ్ల క్రితం ఆమె అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి, అధికార యంత్రాంగంలో చ‌క్రం తిప్పారు. ఆ త‌ర్వాత టెక్క‌లి నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందారు. కానీ ఆమెకు మ‌ళ్లీ ప‌ద‌వీయోగ్యం ద‌క్క‌లేదు. రాజ‌కీయాల్లో ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా ఆమెకు మాత్రం అవ‌కాశం లేదు

ఎట్ట‌కేల‌కు వైఎస్ జ‌గ‌న్ ల‌క్ష్మీపార్వ‌తికి గుర్తింపునివ్వ‌డంతో ఆరంభం నుంచి వైసీపీలో క‌ష్ట‌ప‌డుతున్న ముగ్గురు కీల‌క మ‌హిళాన నేత‌ల‌కు ప‌ద‌వులు ద‌క్కిన‌ట్ట‌య్యింది. ఇప్ప‌టికే ఎమ్మెల్యేగా ఉన్న రోజాకి మంత్రి ప‌ద‌వి ఆశించిన‌ప్ప‌టికీ ఏపీఐఐసీ చైర్మ‌న్ గిరీ క‌ట్ట‌బెట్టారు. వాసిరెడ్డి ప‌ద్మ‌కు మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ స్థానం ద‌క్కింది. ఇప్పుడు ల‌క్ష్మీపార్వ‌తికి తెలుగు అకాడ‌మీ చైర్ ప‌ర్స‌న్ హోదా ద‌క్క‌డంతో ఆమెకు న్యాయం జ‌రిగింద‌నే అభిప్రాయం అభిమానుల్లో వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here