వాన పాల‌యిన టీమిండియా

0

టెస్ట్ మ్యాచ్ లో గెలిచి విజ‌యోత్సాహంతో రెండో టెస్ట్ మ్యాచ్ కి బ‌య‌లుదేరిన ఆట‌గాళ్ల‌కు విశాఖ‌లో చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది. విశాఖ ఎయిర్ పోర్ట్ లో టీమిండియా ఆట‌గాళ్లు త‌డిసిముద్ద‌య్యారు. అధికారుల మ‌ధ్య స‌మ‌న్వ‌య‌లోపంతో చిక్కులు ఎదుర్కొన్నారు.

విశాఖ‌లోని నోవాటెల్ హోట‌ల్ లో బ‌స చేసిన ఆట‌గాళ్లు సోమ‌వారం మ‌ధ్యాహ్నం రాంచీ బ‌య‌లుదేరారు. అయితే విశాఖ ఎయిర్ పోర్ట్ లో వారిని మూడో నెంబ‌ర్ ఫ్లాట్ పాం మీద నిలిపివేశారు. దాంతో బ‌స్సు దిగి న‌డిచి వ‌చ్చేలోగా పెద్ద వ‌ర్షం కుర‌వ‌డంతో వారంతా త‌డిసిపోయారు. మూడో నెంబ‌ర్ ఫ్లాట్ ఫాం మీద షెల్ట‌ర్ గా రేకులు లేక‌పోవ‌డంతో ఈ ప‌రిస్థితి ఎదుర‌య్యింది.

సౌతాఫ్రికా ఆట‌గాళ్ల‌కు ఒక‌టో నెంబ‌ర్ ఫ్లాట్ ఫాం మీద బ‌స్సు ఆప‌డంతో వారంతా సుర‌క్షితంగా ఎయిర్ పోర్ట్ లాంజ్ లోకి చేరుకున్నారు. కానీ కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి త‌డిసిముద్ద‌యిపోయిన టీమిండియా ఆట‌గాళ్లు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ నేరుగా ఎయిర్ పోర్ట్ సీఐని నిల‌దీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here