వాళ్లిద్ద‌రినీ స‌మ‌ర్థిస్తున్న రోహిత్ శ‌ర్మ‌

0

టీ20 చ‌రిత్ర‌లో తొలిసారిగా టీమిండియాకు బంగ్లా బేబీలు షాక్ ఇవ్వ‌డంతో ఫ్యాన్స్ హ‌ర్ట‌య్యారు. సోష‌ల్ మీడియాలో ఘాటు వ్యాఖ్య‌ల‌తో మండిప‌డుతున్నారు. స్వ‌ల్ప స్కోర్ చేసిన బ్యాట్స్ మేన్ల‌ను అర్థం చేసుకున్న అభిమానులు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల‌పై విరుచుకుప‌డుతున్నారు. ముఖ్యంగా 19వ ఓవ‌ర్లో ఖ‌లీల్ ఏకంగా నాలుగు బౌండ‌రీలు వ‌రుస‌గా స‌మ‌ర్పించుకున్న తీరు త‌ల‌చుకుని త‌ల్ల‌డిల్లిపోతున్నారు. దానికి ముందు కృణాల్ పాండ్యా సులువైన క్యాచ్ ని చేజేతులా వ‌దిలేయ‌డాన్ని జీర్ణం చేసుకోలేక‌పోతున్నారు. వారిద్ద‌రితో పాటుగా డీఆర్ఎస్ విష‌యంలో రిష‌భ్ పంత్ తీరుని కూడా తప్పుబ‌డుతున్నారు. ముష్ఫిక‌ర్ కి మూడు ఛాన్సులు అర్థ సెంచ‌రీకి దారులు వేయ‌డ‌మే కాకుండా ఏకంగా మ్యాచ్ కోల్పోవ‌డానికి కార‌ణాల మీద కుత‌కుత‌లాడుతున్నారు.

148 ప‌రుగుల స్కోర్ టీ20ల‌లో త‌క్కువే అయిన‌ప్ప‌టికీ ఢిల్లీ పిచ్ ప‌రిస్థితుల రీత్యా మెరుగైన స్కోర్ గా భావించాల్సి ఉంటుంద‌ని అన‌లిస్టులు సైతం అంగీక‌రిస్తున్నారు. అయితే 19వ ఓవ‌ర్ ని ఖ‌లీల్ తో వేయించ‌డం, 20వ ఓవ‌ర్ చాహ‌ర్ కి అప్ప‌గించ‌డం ద్వారా ఇద్ద‌రు అనుభ‌వం లేని బౌల‌ర్ల‌తో స్లాగ్ ఓవ‌ర్ల‌కు సిద్ధ‌ప‌డిన రోహిత్ శ‌ర్మ త‌న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకుంటున్నాడు. పైగా వికెట్ తీసే సామ‌ర్ధ్యం ఉన్న బౌల‌ర్ ప‌ట్ల విశ్వాసం అవ‌స‌రం అంటున్నాడు. క్యాచ్ చేజారిన తీరు మాత్రం నిరాశ‌ప‌రిచింద‌ని పేర్కొన్నాడు.

అంత‌ర్జాతీయ టీ20ల‌లో వెయ్య‌వ మ్యాచ్ ఆడిన టీమిండియా త‌దుప‌రి మ్యాచ్ న‌వంబ‌ర్ 7న ఆడ‌బోతుండ‌గా డీఆర్ఎస్ విష‌యంలో రిష‌భ్ పంత్ కి అనుభ‌వం లేకపోవ‌డ‌మే కార‌ణం అంటున్నాడు రోహిత్. ఇంకా 10,12 మ్యాచ్ ల అనుభ‌వ‌మే ఉన్న పంత్ మ‌రింత నేర్చుకుంటాడ‌ని వెన‌కేసుకురావ‌డం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here