వైసీపీలో మూడు ముక్క‌లాట‌..!

0

అధికార వైసీపీలో మూడు ముక్క‌లాట ఖాయంగా మారింది. ఇప్ప‌టికే డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ తో పాటుగా వ‌ల‌స వ‌చ్చిన ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు మ‌ధ్య సాగుతున్న ఆధిప్య‌త పోరు ఈసారి తోట త్రిమూర్తులు చేరితో మ‌రో మ‌లుపు తిర‌గ‌డం ఖాయంగా మారింది. తూర్పు గోదావ‌రి జిల్లా రామ‌చంద్రాపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని వైసీపీ ప‌రిణామాలు పెద్ద చ‌ర్చ‌కు తెర‌లేపుతున్నాయి.

ఎన్నిక‌ల‌కు ముందు తోట త్రిమూర్తులు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీలోనూ, బ‌య‌టా కూడా జ‌గ‌న్ మీద తీవ్రంగా స్పందించారు. అయినా ఆయ‌న్ని పార్టీలో చేర్చుకునేందుకు జ‌గ‌న్ సానుకూలంగా ఉన్న‌ప్ప‌టికీ చివ‌ర‌కు రామ‌చంద్రాపురం కాకుండా మండ‌పేట సీటు ఆఫ‌ర్ చేయ‌డంతో తోట‌త్రిమూర్తులు నిరాక‌రించారు. దాంతో సిట్టింగ్ సీటులో తోట త్రిమూర్తులు టీడీపీ త‌రుపున బ‌రిలో దిగి ప‌రాజ‌యం పాల‌య్యారు. అదే స‌మ‌యంలో పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ ని మండ‌పేట నుంచి రంగంలో దించి ప్ర‌యోగం చేసిన జ‌గ‌న్, రామ‌చంద్రాపురం సీటు మాత్రం చెల్లుబోయిన వేణుకి కేటాయించ‌డం ద్వారా త్రిమూర్తుల‌ను ఓడించారు. అయినా పిల్లి బోస్ మాత్రం సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు.

ఎన్నిక‌ల త‌ర్వాత మారిన ప‌రిణామాల‌తో రెండు నెల‌ల నుంచే తోట త్రిమూర్తులు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. వైసీపీ ఛాన్సిస్తే ఆపార్టీ తీర్థం పుచ్చుకోవాల‌ని ఎదురుచూస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగా సానుకూల సంకేతాలు రావ‌డంతో ఆయ‌న సైకిల్ దిగేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దాంతో ఇప్పుడు రామ‌చంద్రాపురం వైసీపీలో మూడో వ‌ర్గం ఖాయంగా మారింది. సామాజిక వ‌ర్గాల వారీగా స‌మీక‌ర‌ణ‌లు క‌నిపించే చోట ఇప్పుడు బీసీల మ‌ధ్య వైరం కొత్త కాపు నేత చేరిక‌తో ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here