వైసీపీ ఎమ్మెల్యేపై ఈనెల 26న విచార‌ణ‌

0

ఏపీ రాజ‌ధాని ప్రాంత ఎమ్మెల్యే వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారుతోంది. ఇప్ప‌టికే వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా త‌న కులాన్ని కించ‌ప‌రిచి, త‌న‌ను అవ‌మానించారంటూ ఆమె ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్ట‌డం, ముగ్గురి అరెస్ట్ చేయ‌డం కూడా జ‌రిగింది. అయితే ఇప్పుడు ఆమె ఎస్సీ కాదంటూ జిల్లా క‌లెక్ట‌ర్ కి అందిన ఫిర్యాదుతో విచార‌ణ ప్రారంభ‌మ‌వుతోంది. కేంద్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేయ‌డం. దానిపై విచార‌ణ చేయ‌మ‌ని ఏపీ సీఎస్ కి ఆదేశాలు రావ‌డంతో ఈనెల 26న గుంటూరు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ విచార‌ణ చేయ‌బోతున్నారు.

తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి చుట్టూ ఈ కులం ఉచ్చు చిక్కుకున్న‌ట్టేన‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఆమె కూడా తాను క్రిస్టియ‌న్ అంటూ ఓ ఇంట‌ర్య్యూలో స్వ‌యంగా అంగీక‌రించారు. దాంతో ఆమె ఎస్సీ స‌ర్టిఫికెట్ కి అన‌ర్హురాలంటూ ఫిర్యాదులో పేర్కొన‌డంతో ఈ విచార‌ణ‌లో ఆమె ఏం చెబుతార‌న్న‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఆమె ఎస్సీ అని నిరూపించుకోవ‌డానికి త‌గ్గ‌ట్టుగా త‌గిన ఆధారాల‌తో విచార‌ణ‌కు రావాలంటూ జేసీ నోటీసులు జారీ చేశారు. ఆమెతో పాటుగా బంధువుల‌కు సంబంధించిన ఆధారాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

డాక్ట‌ర్ గా ఉన్న శ్రీదేవికి తొలిసారిగా పోటీ చేసేందుకు 2019 ఎన్నిక‌ల్లో అవ‌కాశం ద‌క్కింది. అప్పుడు ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావ‌ణ్ కుమార్ ని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆమె భ‌ర్త కాపు సామాజ‌కివ‌ర్గానికి చెందిన వారు కాగా, ఆమె ఎస్సీ సామాజిక‌వ‌ర్గం నుంచి వ‌చ్చిన‌ట్టు బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. దాంతో ఇప్పుడు ఆమె ఆమె వ్య‌వ‌హారంలో కులం వివాదానికి ఎలాంటి ముగింపు ల‌భిస్తుంద‌న్న‌ది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here