వైసీపీ: నెల్లూరు కూల్ కానీ, తాడిప‌త్రిలో రాజుకున్న హీట్

0

వైసీపీ వ్య‌వ‌హారాలు చ‌ర్చ‌నీయాంశాలుగా మారుతున్నాయి. ఆపార్టీ నేత‌ల తీరు ఇప్పుడు వ‌రుస విబేధాల‌కు ఆస్కారం ఇస్తోంది. ఇప్ప‌టికే నెల్లూరు జిల్లా రాజ‌కీయం ర‌చ్చ‌కు దారితీసింది. ఏకంగా పాల‌క‌ప‌క్ష ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి అరెస్ట్ కావాల్సి వ‌చ్చింది. త‌న‌పై కేసులో కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి పాత్ర ఉందంటూ సాటి ఎమ్మెల్యేపై చేసిన ఆరోప‌ణ‌ల‌తో క‌ల‌క‌లం రేగింది.

చివ‌ర‌కు నెల్లూరు విబేధాల‌ను చ‌క్క‌దిద్దేందుకు వైసీపీ అధిష్టానం రంగంలో దిగింది. టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి జోక్యం చేసుకున్నారు. ఇరువురు నేత‌ల‌తోనూ మంత‌నాలు జ‌రిపారు. క‌లిసి సాగాల‌ని ఆదేశించారు. తామిద్ద‌రం బావా బావ‌మ‌రుద‌ల‌మ‌ని, క‌లిసి సాగుతామ‌ని మీడియా ముందు చెప్పుకున్నారు.

ఈ త‌గాదా చ‌ల్లారింద‌ని ఊపిరిపీల్చుకునే లోపే వైసీపీలో మ‌రో వ్య‌వ‌హారం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈసారి అనంత‌పురం జిల్లాలో విబేధాలు వీధికెక్కాయి. మంత్రి శంక‌ర్ నారాయ‌ణ‌తో తాడిప‌త్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పొస‌గడం లేదు. ఈ వ్య‌వ‌హారం ఏకంగా సీఎం కి స్వాగ‌తం ప‌ల‌క‌డానికి వ‌చ్చిన స‌మ‌యంలో త‌న‌కు అవ‌కాశం రాకుండా చేశారంటూ మంత్రిపై తాడిప‌త్రి ఎమ్మెల్యే సీరియ‌స్ అయ్యారు. దాంతో వారిద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌ర‌గ‌డం మీడియా కంట‌ప‌డింది.

వైసీపీ అనంత‌పురం వ్య‌వ‌హారాల్లో ఇది హాట్ టాపిక్ అవుతోంది. జిల్లాలో పార్టీ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌నే విష‌యం తెర‌మీద‌కు రావ‌డంతో త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here