వ‌ర‌ద రాజకీయంలో టీడీపీకి కొత్త బుర‌ద‌

0

వ‌ర‌ద రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. ప‌దేళ్ల త‌ర్వాత కృష్ణా న‌దికి వ‌చ్చిన వ‌ర‌ద‌లు, ప్ర‌తీ ఏటా మాదిరిగానే గోదావ‌రి వ‌ర‌ద‌లు రావ‌డంతో ప్ర‌జ‌లు అపారంగా న‌ష్ట‌పోయారు. పాల‌క ప‌క్షం ఎలా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌తిప‌క్షం మాత్రం ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌వాల్సి ఉన్న‌ప్ప‌టికీ అందుకు భిన్నంగా సాగుతోంది. అధికారంలో ఉన్న‌న్నాళ్లు ప్ర‌జ‌ల‌కు దూరంగా వ్య‌వ‌హ‌రించిన నేత‌లు ఇప్పుడు విప‌క్షంలోకి వ‌చ్చినా త‌మ వైఖ‌రిలో మార్పు లేద‌ని చాటుకుంటున్నారు. దాంతో వ‌ర‌ద రాజ‌కీయాల‌తో బుద‌ర పులుముకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే త‌న ట్వీట్ల‌తో నారా లోకేశ్ టీడీపీ ప‌రువు తీస్తున్నారు. వ‌ర‌ద‌ల సంద‌ర్భంలో ఆయ‌న చేసిన రెండు ట్వీట్లు ప‌రిశీలిస్తే ఈ విష‌యం బోధ‌ప‌డుతుంది. ఓ నాటు ప‌డ‌వ‌ను అడ్డుపెట్టి వ‌ర‌ద‌ను ఆపేశారంటూ ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. సోష‌ల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. ప‌లు సైటెర్లు వినిపించాయి. ఆ త‌ర్వాత నాగార్జున సాగ‌ర్ కి వ‌చ్చిన వ‌ర‌ద క‌న్నా ఎక్కువ వ‌ర‌ద వ‌దులుతున్నారంటూ ఆయ‌న చేసిన ట్వీట్ కూడా అలానే త‌యార‌య్యింది.

తాజాగా చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు కూడా వాటికి త‌గ్గ‌ట్టుగానే ఉన్నాయి. కృత్రిమ వ‌ర‌ద అంటూ, త‌న ఇంటిని ముంచ‌డానికే ప్ర‌య‌త్నం అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చాలామందిని విస్మ‌యానికి గురిచేశాయి. సాగ‌ర్ కి వ‌చ్చిన వ‌ర‌ద క‌న్నా ఎక్కువ నీరు దిగువ‌కు ఎలా వ‌దులుతార‌న్న‌ది అర్థంకాని జ‌నాల‌కు అస‌లు కృత్రిమ వ‌ర‌ద ఎలా సాధ్య‌మో కూడా అంతుబ‌ట్ట‌ని విష‌యంగా మారింది. “చంద్ర‌బాబు త‌న త‌న‌యుడిని త‌న స్థాయికి చేర్చాల్సింది పోయి, తానే లోకేశ్ స్థాయికి చేరుతున్న‌ట్టుగా క‌నిపించ‌డం విస్మ‌య‌క‌రంగా ఉంద‌ని” ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ చేసిన వ్యాఖ్య అందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here