సందిగ్ధంలో సైరా టీమ్

0
84

మెగాస్టార్ లేటెస్ట్ మువీ సైరా సినిమా సందిగ్ధంలో పడింది. ముఖ్యంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కొంత సంశయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడా అన్నది క్లారిటీ రావడం వచ్చినట్టుగా లేదు.

గత వారం జరిగిన ప్రచారం ప్రకారం సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ 15వ తేదీ కర్నూలులో జరుగుతుందన్నారు. కానీ అలాంటి ఊసేది ఇప్పటిదాకా కనిపించడం లేదు. ఒక వారం వాయిదా అనే ఫ్రెష్ అప్ డేట్ అయితే వినిపిస్తోంది కానీ కొణిదెల టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందటం లేదు. నిజంగా సీమ గడ్ద మీద ప్లాన్ చేశారా లేదా అనే క్లారిటీ కూడా లేదు.

మరోవైపు సినిమా విడుదలకు ఇంకో 22 రోజులు మాత్రమే టైం ఉంది. చరణ్ మొన్నే కొత్త ఫోటోతో దీన్ని కన్ఫర్మ్ చేశాడు కాబట్టి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. కాకపోతే ఇంకా ఆడియోతో పాటు ప్రీ రిలీజ్ వేడుక పెండింగ్ లో ఉండిపోయింది కాబట్టి మెగా ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సైరా ఈవెంట్ కర్నూలులో ప్లాన్ చేసిన మాట నిజమే కానీ అదే రోజు అక్కడ గ్రౌండ్ లో ఏవో మతానికి సంబంధించిన సభలు ఆల్రెడీ ఫిక్స్ అయ్యాయి కాబట్టి వేరే తేదీ కోసం ప్రయత్నిస్తున్నారట.

ఒకవేళ 20 నుంచి 25 మధ్యలో అనుకున్నా ఆ ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలుకావాలి. గెస్టులకు కావాల్సిన ముందస్తు బుకింగ్స్ ప్రయాణానికి అవసరమైన పనులు తదితరాలు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. సైరా విడుదలయ్యే దాకా చిరు సైతం తెలుగు రాష్ట్రాలు దాటి బయటికి వెళ్లే ఆలోచనలో లేరట. నార్త్ లో ప్రమోషన్ కోసం మాత్రమే వెళ్లడం తప్పించి పూర్తి స్థాయి సైరా పోస్ట్ ప్రొడక్షన్ మీదే శ్రద్ధ పెట్టినట్టు ఇన్ సైడ్ టాక్. ఒకవేళ కర్నూల్ డ్రాప్ అవ్వాల్సి వస్తే హైదరాబాద్ లో చేస్తారా లేక విజయవాడలో జరిపే ప్లాన్ ఏదైనా ఉందా తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here