సన్నబియ్యంలో చిక్కులు ఎందుకొచ్చాయ్?

0

శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ప్రభుత్వ సన్నబియ్యం పథకం ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా మారింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ చివరకు సీఎం చేతుల మీదుగా ప్రారంభమయిన పథకంలో బియ్యం నాణ్యత లేకపోవడంతో అనేక మంది నిరాశపడ్డారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో విపక్షాలకు పెద్ద ఆయుధంగా మారింది. జగన్ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశాయి.

శ్రీకాకుళం జిల్లాకు బియ్యం సంచులను తూర్పు గోదావరి జిల్లా నుంచి తరలించారు. తరలింపు సమయంలో వర్షాల కారణంగా కొన్ని బస్తాలు తడిచినట్టు అధికారులు అంగీకరిస్తున్నారు. తడిచిన్న బియ్యం ప్రజలకు పంపిణీ చేయడంలో లోపం ఉందని ప్రభుత్వం అంగీకరించినట్టయ్యింది. తద్వారా తమ వైఫల్యం కారణంగానే ప్రజలకు నాణ్యమైన బియ్యం బదులుగా తినడానికి వీలులేని రీతిలో సరఫరా జరిగినట్టు స్ఫష్టం అవుతోంది.

ఈ నాసిరకంగా ఉన్న బియ్యం పంపిణీలోనూ, దానిని సోషల్ మీడియాలో ప్రచారంలోనే పెద్ద కుట్ర ఉందని వైసీపీ ఎదురుదాడికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తిరుమలలో మత ప్రచారం వంటి కొన్ని అంశాలలో పెద్ద స్కెచ్ ఉందని స్పష్టమయిన తరుణంలో సన్నబియ్యం పంపిణీలో లోపాల వెనుక కూడా కొందరి కుట్ర ఉందనే సందేహాలను వారు వినిపిస్తున్నారు. కానీ ప్రతిపక్షం మాత్రం తీవ్ర ఆరోపణలు చేస్తూ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది.

రాజకీయంగా కుట్రలు ఉన్నా లేకున్నా సన్నబియ్యం పంపిణీలో కొన్ని సమస్యలు ఉన్నాయన్న విషయం అంగీకరించి వాటిని సరి చేయడానికి తగిన రీతిలో ప్రభుత్వం స్పందించం అవసరంగా కనిపిస్తోంది. లేకుంటే ప్రజల్లో మరింత అభాసుపాలుకావడం ఖాయం. అదే సమయంలో కుట్రలు ఉంటే వెంటనే వెలుగులోకి తీసుకురావడం ద్వారా నష్ట నివారణ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here