‘సాహో’ ప్ర‌భాస్ కొత్త ట్విస్ట్

0

‘బాహుబలి’ బంప‌ర్ హిట్ త‌ర్వాత గ్యాప్ తీసుకుని వ‌స్తున్న డార్లింగ్ సాహో అనిపించుకునేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ స‌ర‌స‌న శ్రద్ధాకపూర్‌ కథానాయికగా చేస్తోంది. ఇటీవల విడులైన సాహో ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇక సినిమాలో అండర్‌ కవర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. 2వేల కోట్ల దోపిడికి సంబంధించిన కేసును ఛేదించే సిన్సియ‌ర్ ఆఫీస‌ర్ గా సంచ‌ల‌నంగా మార‌బోతున్నాడు. ఇక తాజాగా టాలీవుడ్ స‌ర్కిళ్ల‌లో వినిపిస్తున్న మాట ప్ర‌కారం మ‌రో ట్విస్ట్ కూడా ఉంటుంద‌ని స‌మాచారం. అది ఏమిటంటే ప్రభాస్‌ ఇందులో ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారనే చ‌ర్చ జోరుగా ఉంది. దానిని సినిమా యూనిట్ ఖండించ‌డం లేదు. దాంతో ఈసారి ప్ర‌భాస్ డబుల్ రోల్ తో ఫ్యాన్స్ ని అల‌రించ‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది.

ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచే రీతిలో ఉండాల‌నే ల‌క్ష్యంతో ఈ ట్విస్ట్ ని బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌డం లేద‌ని చెబుతున్నారు. ఆగస్టు 30న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here