సింధుకి మ‌రో ఛాన్స్..!

0

ఇండియాన్ బ్యాడ్మింట‌న్ పీవీ సింధుకి మ‌రోమారు అరుదైన అవ‌కాశం ద‌క్కింది. వ‌ర‌ల్డ్ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్ షిప్ లో ఆమె మూడోసారి పైన‌ల్ కి చేరింది. గ‌తంలో రెండు సార్లు ఫైన‌ల్ లోనూ, రెండు సార్లు సెమీస్ లో ఓడిన సింధు ఈసారి మాత్రం ప‌ట్టుద‌ల‌తో ఆడింది. ప్ర‌తాపం చూపించింది. ప‌వ‌ర్ గేమ్ తో ఫైనల్ కి దూసుకెళ్లింది.

మ‌హిళ‌ల సింగిల్స్ విభాగం సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో చెన్ యూ ఫె ని వ‌రుస సెట్ల‌లో ఓడించింది. 21-7, 21-14 తేడాతో చిత్తు చేసింది. కేవ‌లం 40 నిమిషాల్లోనే సెమీఫైన‌ల్స్ ముగిసిపోవ‌డం విశేషం. దాంతో వ‌రుస‌గా మూడోసారి ఫైన‌ల్ కి చేరి చ‌రిత్ర సృష్టించింది. వ‌ర‌ల్డ్ బ్యాడ్మింట‌న్ టైటిల్ గెలిచిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా రికార్డ్ పుట‌లకెక్కేందుకు మ‌రో అడుగు దూరంలో నిలిచింది. ఈసారయినా సింధు బంగారు సింధు కావాల‌ని భార‌తీయులంతా ఆశిస్తున్నారు.

చైనాకి చెందిన వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 3ని ఓడించి ఫైన‌ల్స్ లో అడుగుపెట్టిన నేప‌థ్యంలో ఫైన‌ల్ మ్యాచ్ కి ముందు సింధు ఆత్మవిశ్వాసం జోష్ లో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here