సీబీఐ వ‌ల‌లో టీడీపీ సీనియ‌ర్ నేత‌

0

తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు వ‌రుస‌గా కేసులు త‌ప్పేలా లేవు. ఇప్ప‌టికే మాజీ స్పీక‌ర్ ఇక్క‌ట్ల‌లో ఉన్నారు. అసెంబ్లీ ఫ‌ర్నీచ‌ర్ దొంగ‌త‌నం కేసుల్లో ఆయ‌న మీద ఇరుక్కున్నారు. కోడెల కుమార్తె, కుమారుడు కూడా హైకోర్ట్ నుంచి ముంద‌స్తు బెయిల్ మీద సాగుతున్నారు. ఈలోగా గుంటూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత మీద సీబీఐ వ‌ల విసురుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

గుర‌జాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పై సీబీఐ విచారణ రెడీ అయిన‌ట్టుగా క‌నిపిస్తోంది. మైనింగ్ వ్య‌వ‌హారాల్లో అక్ర‌మాలు ఆయ‌న మెడ‌కు చుట్టుకుంటున్నాయి. ప‌ల్నాడు ప్రాంతంలో య‌ర‌ప‌తినేని వ్య‌వ‌హారాలు గాలిజ‌నార్థ‌న్ రెడ్డిని మించిపోయిన‌ట్టుగా ప‌లువురు ఆరోపిస్తుంటారు. ఆయ‌న్ని మైనింగ్ డాన్ గా వైసీపీ విమ‌ర్శ‌లు చేసింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న సాగించిన మైనింగ్ పై విచార‌ణ‌కు రంగం సిద్ధం అవుతుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

మైనింగ్ వ్య‌వ‌హారాల‌కు తోడుగా ఆంధ్రాబ్యాంక్ లో యరపతినేని లావాదేవీలను సీఐడీ గుర్తించిన దానికి త‌గ్గ‌ట్టుగా విచార‌ణ‌కు అనుమ‌తి ఇవ్వాలంటూ హైకోర్ట్ ని ఆశ్ర‌యించింది. సీబీఐ విచారణ కు వెళ్ళాలా వద్దా అనే అంశంపై నిర్ణయం రాష్ట్ర ప్రభత్వానికి వదిలేసిన హైకోర్టు, దానికి త‌గ్గ‌ట్టుగా ఆదేశాలు ఇచ్చింది. బుదవారం లో గా నిర్ణయం తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికే అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు సీఐడీ నిర్థారించిన నేప‌థ్యంలో సీబీఐ రంగంలో దిగితే య‌ర‌ప‌తినేనికి చిక్కులు త‌ప్ప‌వ‌ని భావిస్తున్నారు.

ఎరపతినేని వియ్యంకుడు పేరం హరిబాబు కూడా కొంత‌కాలంగా చిక్కుల్లో ఉన్నారు. పేరం గ్రూప్ కంపెనీస్ పేరుతో రియ‌ల్ ఎస్టేట్ లో ఎదిగిన హరిబాబు వ‌ద్ద కొంత కాలం క్రితం 7 కోట్ల న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు. పేరం గ్రూపు సంస్థ‌ల పై ఐటీ దాడులు కూడా నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు య‌ర‌ప‌తినేని వ్య‌వ‌హారం కూడా తోడు కావ‌డంతో స‌మ‌స్య‌లు రెట్టింప‌యిన‌ట్టుగా చెబుతున్నారు. టీడీపీకి ఆర్థిక ద‌న్ను అందించే ఈ వియ్యంకులు ఇద్ద‌రూ స‌మ‌స్య‌ల్లో ఇరుక్కోవ‌డం ప్ర‌తిప‌క్ష పార్టీకి కూడా కొంత స‌మ‌స్య అవుతుంద‌ని అంచ‌నాలు వేస్తున్నారు. య‌ర‌ప‌తినేనికి స‌హ‌కరించిన ఆనాటి అధికార పార్టీ పెద్ద‌ల వ్య‌వ‌హారం కూడా బ‌య‌ట‌ప‌డుతుందా అన్న ప్ర‌శ్న ఉద‌యిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here