సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిర‌ధ‌మ‌హార‌థులు

0

మెగాస్టార్ లేటెస్ట్ మువీ సైరా ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మార‌బోతోంది. ఈ సినిమాకు సంబంధించి అభిమానుల్లో ఉత్సుక‌త క‌నిపిస్తోంది. 150వ సినిమా స‌క్సెస్ చేసుకుని టాలీవుడ్ లో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి 151వ సినిమా కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే సైరా కొంత ఆల‌శ్యం అయిన‌ప్ప‌టికీ అంద‌రినీ అల‌రించేలా సిద్ధం అయ్యింద‌నే ప్ర‌చారం వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధం అవుతున్న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగ‌రంగ వైభవంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈకార్య‌క్ర‌మానికి ప‌లువురు స్టార్లు హాజ‌రుకాబోతున్న‌ట్టు చెబుతున్నారు. జాబితాలో అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌జ‌నీకాంత్ స‌హా ప‌లువురి పేర్లు ఉన్న‌ట్టు స‌మాచారం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహా రెడ్డి లో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. సురేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమా చారిత్రాక క‌థాంశం కావ‌డంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌నే విశ్వాసం క‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here