సైరా: సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ సంచ‌ల‌న రివ్యూ

0

చిరంజీవి “సైరా” మన భారతీయ సినిమా…
తన నూటయాభై సినిమాల అనుభవాన్ని రంగరించి సైరా నరసింహారెడ్డి సినిమా తీసినట్లుంది…అంతలా ఒదిగిపోయాడు నరసింహారెడ్డి పాత్రలో..రామ్ చరణ్ తన తండ్రికి మంచి గిఫ్టే ఇచ్చాడు….సైరా విషయానికొస్తే ముందుగా రాంచరణ్ ని మెచ్చుకోవాలి..చరిత్ర పుటల్లో కలిసిపోయిన ఒక మహానియుడి జీవిత కథను కమర్షియల్ గా తెరకెక్కించాలంటే మాటలా..పైగా చిరంజీవి తన పన్నెండేళ్ల కల..అలాంటి ఈ సినిమాను సురేందర్ రెడ్డి చేతుల్లో పెట్టడం సాహసమే..అసలా మహానియుడికి ఇంత పెద్ద కధ ఉందానిపిస్తోంది.. అలాంటి కథను స్వాతంత్య్రం విలువ మర్చిపోతున్న ఈ తరానికి ఖచ్చితంగా చూపించాలి..అందుకే హేట్సాఫ్ రాంచరణ్…ముఖ్యంగా ఈ చిత్రంలో పాత్రలే కనబడతాయి పాత్రధారులు కనబడరు..దర్శకుడు సురేందర్ రెడ్డి చేసిన కసరత్తంతా మనకు తెరపై కనబడుతుంది..ఇలాంటి సినిమాకు స్క్రీన్ ప్లే రాయడమంటే మాములు విషయం కాదు…సాయి మాధవ్ బుర్రా మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి..రత్నవేలు ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది..ప్రథమార్థంలో పాత్రల పరిచయానికే ఎక్కువ టైమ్ తీసుకుంటాడు దర్శకుడు దానితో అక్కడక్కడా డాక్యుమెంటరీ ఫీలింగ్ వస్తుంది.. ద్వితీయార్థంలో దర్శకుడు ఆ ఛాన్స్ మనకివ్వడు…చివరి అరగంట రోమాలు నిక్కబొడుచుకుంటాయంటే నమ్మాలి…విజయ్ సేతుపతి, సుదీప్,అమితాబ్ వీరందరి కాంబినేషన్ చూస్తుంటే మైండ్ బ్లోయింగే..నయనతార కంటే కూడా తమన్నా పాత్ర ఎంతగానో ఆకట్టుకుంటుంది..మొత్తానికి అవురావురుమంటూ ఎదురుచూస్తున్న అభిమానులకు సైరా నరసింహారెడ్డి అసలైన దసరా పండుగ ..

-గ‌ర‌గ త్రినాధ‌రావు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here