సోష‌ల్ మీడియాలో కొత్త ట్రెండ్:జ‌న‌సేనానికి అవ‌మానం!

  0

  కొంత‌కాలంగా త‌మిళ‌నాట సాగుతున్న ట్రెండింగ్ వ్య‌వ‌హారం తెలుగు గ‌డ్డ‌కి పాకింది. రివ‌ర్స్ ట్రెండింగ్ తో ఇప్పుడు సోష‌ల్ మీడియా హోరెత్తిపోతోంది. కీల‌క స‌మ‌యాల్లో ఏదైనా ఒక అంశాన్ని ట్రెండింగ్ చేయ‌డం ద్వారా అంద‌రి దృష్టికి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం చాల‌కాలంగా ఉంది. కానీ ఇప్పుడు అది రివ‌ర్స్ అవుతోంది. ఎదుటి వారికి ముఖ్య‌మైన సంద‌ర్భాల మీద గురిపెట్టి రివ‌ర్స్ విష‌యాన్ని ట్రెండ్ చేయ‌డం ఇప్పుడు పెరుగుతోంది. ఇటీవ‌ల త‌మిళ‌నాడులో ఈ పంథా కొత్త పుంత‌లు తొక్కి ఎదుటి హీరోల‌కు రిప్ అని కూడా ట్విట్ట‌ర్ లో ట్రెండ్ చేసిన తీరు విజ‌య్, అజిత్ ఫ్యాన్స్ మీద ఏర్ప‌డింది.

  తాజాగా తెలుగులో టాప్ హీరోగా కొన‌సాగి, ప్ర‌స్తుతం జ‌న‌సేనానిగా రాజ‌కీయంగా క్రియాశీల‌కంగా ఉంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా #HappyBirthdayPawalaKalyan అంటూ ట్రెండ్ అయిన తీరు విస్మ‌యం క‌లిగిస్తోంది. గ‌తంలో జ‌గ‌న్ , మ‌హేష్ బాబు, ప్ర‌భాస్ స‌హా ప‌లువురు హీరోల విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు కొంద‌రు ఆరోపిస్తున్నారు. వాటికి కౌంట‌ర్ గానే ఈ విష‌యాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చిన‌ట్టు చెబుతున్నారు. కొంద‌రు కావాల‌ని సృష్టించిన ఈ హ్యాష్ ట్యాగ్ #HappyBirthdayPawalaKalyan విష‌యంలో ప‌వ‌న్ ఫ్యాన్స్ కోసం గ‌మ‌నించ‌కుండా భాగ‌స్వాముల‌యిన‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో ఇది ట్రెండింగ్ లో ముందుకు రావ‌డంతో ప‌లువురు ప్ర‌ముఖులు కూడా పోస్టులు చేసి అదే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండింగ్ లో ముందుకు తీసుకొచ్చేశారు.

  ఈ అంశం మాత్రం ఇప్పుడు ట్విట్ట‌ర్ లో ట్రెండింగ్ విష‌యాల్లో ఒక‌టిగా మార‌డం మాత్రం ఆస‌క్తిగా త‌యార‌య్యింది. ఈ ప‌రిస్థితి కొన‌సాగితే భ‌విష్య‌త్తులో మ‌రిన్ని వికృత పోక‌డ‌లు ఖాయంగా క‌నిపిస్తోంది. ఇన్నాళ్లుగా రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ప‌వ‌న్ పై పావ‌లా అంటూ ట్విట్ట‌ర్ లో ట్రెండింగ్ చేయ‌డం ద్వారా దేశం దృష్టికి తీసుకెళ్ల‌డం మాత్రం విశేష‌మే.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here