స్టైలిష్ స్టార్ సంచ‌ల‌నం, రికార్డులు బ‌ద్ధ‌లు

0

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మువీ ఎంట్రీ అదిరింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’ ఆరంభం సంచ‌ల‌నంగా మారుతోంది.. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ప‌ట్ల‌ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ త‌డాఖా చూపుతున్నాయి.

ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ లిరికల్ సాంగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన అద్భుతమైన పదాలతో.. శ్రీరామ్ వినసొంపైన ఆలాపనతో ఈ పాట యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కమ్మనైన అమ్మ పాటలా ఉండటంతో యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను తెగ వినేస్తూ.. లైకులు కొడుతున్నారు. దీనితో ఈ చాట్‌బస్టర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ.. నెంబర్ వన్‌లో ట్రెండింగ్ అవుతోంది. 24 గంటల్లోనే 6 మిలియన్ వ్యూస్, 3,12,000లైక్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు తెలుగులో ఒక లిరికల్ వీడియోకు ఈ స్థాయిలో వ్యూస్ రావడం ఇదే మొదటిసారి.

ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. పూజా హెగ్డే, నవదీప్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్, సుశాంత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here